నిత్యం మనం అనేక రకాల ఆహార పదార్థాలను తింటుంటాం. ఇంట్లో చేసుకునే వంటలే కాక, బయట కూడా అనేక పదార్థాలను ఆబగా లాగించేస్తుంటాం. అయితే మనం తినే అన్ని ఆహారాలు ఆరోగ్యకరమైనవి కావు. ఉదాహరణకు.. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నవి, చక్కెర ఎక్కువగా ఉన్నవి.. మన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. కనుక నిత్యం మనం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగిన ఆహార పదార్థాలనే తినాల్సి ఉంటుంది.
* నిత్యం మనం ఏ సమయంలో ఏ ఆహారం తిన్నా అది సులభంగా 3 లేదా 4 గంటల్లో జీర్ణం అయ్యేలా చూసుకోవాలి. అలాంటి ఆహారాలను తినాలి. ఇక మీరు మీ జీర్ణశక్తికి అనుగుణంగా ఆహారం తినాల్సి ఉంటుంది. అంటే.. ఫలానా ఆహారం తింటే జీర్ణం అవుతుందా, కాదా అనే విషయాలను తెలుసుకుని మరీ ఆహారాన్ని తినాలి.
* నిత్యం మనం తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా పచ్చికూరగాయలతోపాటు పండ్లు కూడా ఉండేవిధంగా చూసుకోవాలి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
* ఏ సీజన్లలో లభించే ఆహారాలను ఆ సీజన్లలో తినాలి. దీంతో సీజన్ల వారిగా వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* ఎక్కువగా కీరా, పాలకూర, యాపిల్స్, టమాటాలను తినాలి.
* ప్రోటీన్ల కోసం మాంసాహారాలనే ఎక్కువగా తినాల్సిన పనిలేదు. శాకాహారాల్లోనూ అనేక పదార్థాల్లో మనకు ప్రోటీన్లు లభిస్తాయి. పచ్చి బఠానీలు, పప్పు దినుసులు, మొలకెత్తిన గింజలు, ముఖ్యంగా మొలకెత్తిన పెసలు, శనగలు, బాదంపప్పు, పాలకూర, సోయా లాంటి పదార్థాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కనుక ప్రోటీన్ల కోసం వీటిని తరచూ తీసుకుంటే చాలు, మాంసమే తినాల్సిన పనిలేదు.
* మీరు ఏం తినాలి, ఎంత తినాలి అనే విషయాలను మీరే నిర్దారించుకోవాలి. మీరు ఏయే ఆహారాలను తినగలరు, ఏవి ఎంత సమయంలో జీర్ణం అవుతాయి, మీకున్న సమస్యలు ఏమిటి ? అందుకు అనుగుణంగా ఏయే ఆహారాలను తినాలి ? అనే విషయాలను ఒక్కసారి ఆలోచించి.. అందుకు అనుగుణంగా నిత్యం ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365