ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులు పెడుతున్న సమస్యల్లో హైబీపీ సమస్య కూడా ఒకటి. దీన్నే హై బ్లడ్ ప్రెషర్ అని, రక్తపోటు అని అంటారు. హైబీపీ ఉన్నవారు జీవితాంతం దాన్ని కంట్రోల్ చేసేందుకు వైద్యులు సూచించిన విధంగా మందులను వాడుతూనే ఉండాలి. అలాగే జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలి. అప్పుడే బీపీ కంట్రోల్ అవుతుంది.
అయితే హైబీపీ సమస్య ఉన్నవారు కోడిగుడ్లను తినవచ్చా.. అంటే.. కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు నిత్యం 300 మిల్లీగ్రాముల కన్నా తక్కువ మోతాదులో కొలెస్ట్రాల్‌ను తీసుకోవచ్చు. అదే హైబీపీ ఉన్నవారు అయితే నిత్యం 200 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా కొలెస్ట్రాల్‌ను తీసుకోవచ్చు. కానీ గుడ్లలో 213 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే.. హైబీపీ ఉన్నవారు వీటిని ఏమాత్రం తినరాదు.. అని స్పష్టమవుతుంది.
అయినప్పటికీ బీపీ నియంత్రణలో ఉండి, అన్ని జాగ్రత్తలు పాటించేవారు కోడిగుడ్లను తినవచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేయించుకుంటూ ఉండాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. కోడిగుడ్లను తినడం ద్వారా పోషకాలు కూడా లభిస్తాయి. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకుంటూ ఆరోగ్యకరమైన పద్ధతులను పాటిస్తామని అనుకునేవారు, బీపీ నియంత్రణలో ఉండేవారు కోడిగుడ్లను తినవచ్చు. కానీ బీపీ నియంత్రణలో లేని వారు కోడిగుడ్లను తింటే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వాటిలో ఉండే కొలెస్ట్రాల్ ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి తద్వారా హార్ట్ ఎటాక్‌లు రావచ్చు. కనుక జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365