హెల్త్ టిప్స్

యువ‌త‌లో ఆర్థరైటిస్‌ వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి..?

ఒక‌ప్పుడు కీళ్ల నొప్పులు అంటే ముస‌లి వ‌య‌స్సుకి వ‌చ్చాక వ‌చ్చేవి. కాని ప‌రిస్థితులు అలా లేవు.సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ చేతులు, కాళ్ళలో నొప్పి, కీళ్లలో నొప్పులు వంటి సంభవిస్తుంటాయి. అయితే ఆర్థరైటిస్ ప్రాబల్యం ఇటీవల మరింత పెరిగింది. దీంతో యువతలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఫిట్నెస్‌తో పాటు వివిధ రకాల పోషకాలు లోపించడం. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా తక్కువ వయస్సువారిలో కూడా కన్పిస్తోంది.ఆర్థరైటిస్ అనేది సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే సమస్య. ప్రత్యేకించి చలి పెరిగినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంటుంది.

ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల ప్రస్తుతం నడి వయస్సులోనే జాయింట్ పెయిన్స్ బారినపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాల్సిన వయస్సులో ఆర్థరైటిస్ బారినపడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది, ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి.. బయటి సూక్ష్మజీవుల నుంచి మానవ శరీరాన్ని రక్షించే రోగనిరోధక వ్యవస్థ దాడి చేసి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీని వల్ల ఈ వ్యాధి వస్తుంది.యువకుల్లో ఆర్ధరైటిస్ సమస్యలు కారణాలు చాలానే ఉన్నాయి. స్థూలకాయం, అస్తవ్యస్థ జీవనశైలి, పోశ్చర్ సరిగ్గా లేకపోవడం, ఎక్కువ ఒత్తిడి కల్గించే క్రీడలు ఆడటం, కీళ్లలో గాయాలు, జెనెటిక్ కారణాలు వంటివి కారణం కావచ్చు. జాయింట్ పెయిన్స్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. తరచూ కండరాల నొప్పి కూడా మరో కారణం.

arthritis is increasing in youth what tips you should take

జీవనశైలిని సక్రమంగా మల్చుకుని, ఒత్తిడి తక్కువగా కల్గించే వ్యాయామం చేస్తుంటే ఆర్థరైటిస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. హైలూరోనిక్ ఇంజెక్షన్, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా వంటి అడ్వాన్స్‌డ్ చికిత్సా విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పరిస్థితి విషమంగా ఉంటే సర్జరీ కూడా అవసరమౌతుంది. ఇందులో ఆర్ధోస్కోపీ లేదా జాయింట్ రీప్లేస్‌మెంట్ చివరి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. యువకుల్లో త్వరగా ఈ వ్యాధిని గుర్తించగలిగితే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల్నించి రక్షించుకోవచ్చు. అందుకే కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలు తరచూ బాధిస్తుంటే నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని వెంట‌నే సంప్ర‌దించ‌డం మంచిది.

Sam

Recent Posts