ఈజ్యూస్ పేగుల్లో ఒక్క చుక్క వ్యర్థాన్ని కూడా వదలదు. ఒక్కసారి తాగితే జీవితాంతం ఎలాంటి సమస్యలు ఉండవు!! ప్రతిరోజు ఉదయం టీ, కాఫీ తాగడం మానేసి గుమ్మడికాయ రసం తాగితే పేగులు పూర్తిగా శుభ్రమవుతాయి. నీరు, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును రుబ్బి తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ. ఇది చాలా ఆరోగ్యవంతమైంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి.
బూడిద గుమ్మడికాయను కేవలం దిష్టి తీయడం కోసమే అనుకుంటారు. కానీ ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఈ గుమ్మడికాయ జ్యూస్‌ను తాగితే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణ సమస్యలను తగ్గేలా చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం ఉండవు. అలాగే ఈ కాయల్లో నీరు అధికంగా ఉంటుంది కనుక ఈ కాయల జ్యూస్‌ను సేవిస్తే శరీరంలో నీరు సమతుల్యంలో ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
బూడిద గుమ్మడికాయల్లో క్యాలరీలు తక్కువ. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తం తయారయ్యేలా చేస్తుంది. ఈ జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా తెల్ల గుమ్మడికాయ ముక్కను తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి. తర్వాత మిక్సర్ జార్‌లో వేసి.. ఒక కప్పు నీళ్లు పోసి జ్యూస్ లాగా రుబ్బుకోవాలి. ఈ గుమ్మడికాయ రసాన్ని ఒక గ్లాసులో వడకట్టి ఉదయం త్రాగడం వల్ల పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వస్తాయి. మీరు ఈ గుమ్మడికాయ ముక్కలను ఉప్పు, మిరియాల పొడి మరియు నిమ్మరసంతో కలిపి కూడా తినవచ్చు. ఇవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.