lifestyle

అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి కంటపడ్డాడు…తర్వాత ఆ తండ్రి ఏం చేసాడో తెలిస్తే షాక‌వుతారు..!

అశ్లీలం.. మొబైల్ లో ఈజీగా దొరికేస్తోంది. నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. మన మొబైల్ లో ప్రత్యక్షం అయిపోతుంది. చిన్న పిల్లలకు సైతం మొబైల్ కంపల్సరీ అయిపోయిన ఈ రోజుల్లో అదేస్థాయిలో అశ్లీలం కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో యువత పెడదోవ పడుతోంది. నేటి పేరంట్స్ కి ఇది సమస్యగా మారింది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో గ‌తంలో జరిగింది. కుమారుడు పదేపదే మొబైల్ లో చూస్తుండటంతో మందలించాడు తండ్రి. అయినా వినకపోవటంతో చేయి నరికేశాడు.

హైదరాబాద్ లోని ఓ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కుమారుడి (18) ప్రవర్తనలో గ‌త కొంత కాలంగా మార్పు వచ్చింది. పనికి కూడా సరిగా వెళ్లటం లేదు. ఎప్పుడూ మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఇది గమనించిన తండ్రి.. ఏం జరుగుతుందో దృష్టి పెట్టాడు. అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడని గుర్తించి మందలించాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో కుమారుడి మొబైల్ దాచేశాడు. దీంతో తండ్రి – కొడుకు మధ్య గొడవ జరిగింది. ఓ సారి తండ్రిపైనే దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సర్ధిచెప్పి ఇంటికి తీసుకొచ్చాడు తండ్రి. అయినా వినకుండా కుమారుడు అదే పనిగా మళ్లీ మొబైల్ చూస్తూ తండ్రి కంట పడ్డాడు.

father caught his son watching those videos on phone

కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో ఒక్కసారిగా తండ్రి ఆవేశం కట్టలు తెంచుకుంది. తండ్రి మాంసం కొట్టే కత్తితో కుమారుడి చేయి నరికాడు. ఈ సంఘ‌ట‌న గ‌తంలో జ‌రిగిందే అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మ‌రోమారు దీన్ని వైర‌ల్ చేస్తున్నారు.

Admin

Recent Posts