lifestyle

నెగెటివ్ ఆలోచనల నుండి బయటపడడం ఎలా? అద్భుత‌మైన క‌థ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పని చేద్దామా&quest; అని అనుకోగానే… ఫెయిల్ అయితే ఎలా అని తెగ హైరానా పడిపోతుంటాం&period; కొత్త కార్యానికి శ్రీకారం చుట్టకముందే సక్సెస్ వస్తుందా రాదా అని లెక్కలేస్తాం…మనం చేయాల్సిన పనిమీద దృష్టిపెట్టకుండా…&period;ఫలితాల గురించి ముందుగానే విశ్లేషణలు చేస్తుంటాం&period; అసలు పని స్టార్ట్ చేయకముందే నెగెటివ్ ఆలోచనలు మన మైండ్ లో గిర్కీలు కొడుతుంటాయ్… ఈ పని చేయాలా&quest; వద్దా&quest; అంటూ మనం డైలమాలో పడిపోతాం…అయితే ఇక్కడ ఓ చిన్న కథ ద్వారా మనలో నెగెటివ్ ఆలోచనలను ఎలా దూరం చేసుకోవొచ్చో…ఓ పాత్ర ద్వారా చెప్పడం జరిగింది&period; ఈ కథ ద్వారా మీ దృక్పథంలో మార్పు వస్తుందనుకుంటూ…………&period;&period;ఆ కథ మీకోసం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది &period; అది నిండు గర్భిణి…&period;దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి &period;అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది &period;ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది &period; దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది &period; అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది &period; నొప్పులు మొదలయ్యాయి &period; నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది …&period;&period;అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి &period; ఉరుములు &comma; పిడుగులు&period; పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది &period; దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది &period; ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు&period; ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు …&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78117 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;negative-thoughts-&period;jpg" alt&equals;"how to over come negative thoughts wonderful story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భగవాన్ &excl; ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి &quest;&period;ఏమి జరగబోతోంది &quest;లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా &quest; బిడ్డ బతుకుతుందా&quest; సింహం లేడిని తినేస్తుందా &quest; వేటగాడు లేడిని చంపెస్తాడా &quest; నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా&quest;ఒక వైపు నిప్పు రెండో వైపు నది &comma; మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు &comma; సింహం&period; కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు&period; అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి……&period;పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి&period; గురి తప్పి బాణం సింహానికి తగిలింది&period; వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి&period; లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది&period; అది ఆరోగ్యం గా ఉంది……&period;ఏదైతే జరగనీ &comma; నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే …&period;&period; ఏమి జరిగేది&quest;&quest;&quest;&quest;…&period;మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి &period; నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము &period; మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము &period;భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts