Beer Side Effects : రోజూ బీర్ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Beer Side Effects : మ‌ద్యం ప్రియులు ఇష్టంగా తాగే డ్రింక్స్‌లో బీర్ కూడా ఒక‌టి. వేస‌వి కాలంలో అయితే బీర్‌ను చాలా మంది రోజూ సేవిస్తుంటారు. ఎండ వేడికి చ‌ల్ల‌ని బీర్ తాగితే వ‌చ్చే మ‌జాయే వేరుగా ఉంటుంద‌ని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ మాట ఎలా ఉన్నా రోజూ బీర్ తాగితే అస‌లు ఏం జరుగుతుంది.. మ‌న‌కు ఎలాంటి లాభాలు ఉంటాయి, ఏ విధంగా న‌ష్టం జ‌రుగుతుంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బీర్ తాగితే ఎముక‌ల సాంద్ర‌త పెరుగుతుంద‌ట‌. స్త్రీ, పురుషులు ఇద్ద‌రికీ ఇది మేలు చేస్తుంద‌ట‌. బీర్ తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా మారుతాయి. అయితే రోజూ బీర్ తాగ‌కూడ‌దు. కేవ‌లం వారానికి ఒక‌సారి ఒక టిన్ బీర్ తాగితేనే ఈ ప్ర‌యోజనం క‌లుగుతుంది.

ఇక రోజూ బీర్ తాగ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య వస్తుంది. చాలా మంది మ‌ద్యం సేవిస్తే చ‌క్క‌గా నిద్రప‌డుతుంద‌ని అనుకుంటారు. అది వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ ఆరంభంలో మాత్ర‌మే ఇది ప‌నిచేస్తుంది. రోజూ బీర్ తాగితే నిద్ర ప‌ట్ట‌క‌పోగా ఇంకా నిద్ర‌లేమి ఎక్కువ‌వుతుంది. దీర్ఘ‌కాలికంగా నిద్ర‌ను డిస్ట‌ర్బ్ చేస్తుంది. దీంతో మెద‌డు ప‌నితీరు మంద‌గిస్తుంది. క‌నుక బీర్‌ను వారానికి ఒకసారి మాత్ర‌మే ప‌రిమితం చేసుకోవాలి.

Beer Side Effects what happens if you drink it daily
Beer Side Effects

అధిక బ‌రువు స‌మ‌స్య ఉన్న‌వారు, లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు బీర్‌ను తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బీర్ తాగితే ఆ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. క‌నుక వీరు బీర్‌ను తాగ‌కూడ‌దు. ఇక బీర్‌ను రోజూ సేవించ‌డం వ‌ల్ల పేగుల‌కు ఎంత‌గానో నష్టం క‌లుగుతుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా విరేచ‌నాలు, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే బీర్ సేవించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ద్ర‌వాలు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. ఇన్ని న‌ష్టాలు ఉన్నాయి క‌నుక రోజూ బీర్‌ను సేవించ‌రాదు. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు వారానికి ఒక‌సారి బీర్ తాగితే దాంతో లాభాలే పొంద‌వ‌చ్చు. కానీ రోజూ మాత్రం తాగ‌కూడ‌దు.

Editor