హెల్త్ టిప్స్

Belly Fat : ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే.. దీన్ని తాగితే క‌రిగిపోతుంది..

Belly Fat : ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారుతున్న జీవనశైలిని బట్టి అధిక బరువు సమస్యతో ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నాడు. అధిక బరువు వలన డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యల బారినపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే మన శరీరానికి ఎన్నో పోషక విలువలు ఉన్న ఆహారం అవసరం. మనం చెప్పుకునే పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాల్లో మెంతులు కూడా ఒకటి.

మెంతులలో ఎన్నో రకాల పోషక విలువలు ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిత్యం మెంతుల‌ను తింటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అధికబరువుతో ఇబ్బందిపడే వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది బాణలాంటి పొట్ట. బాణ పొట్ట అనేది మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలలో ఒకటి. శరీరంలో మిగతా భాగాలు సన్నగా ఉన్న పొట్ట మాత్రం బాగా ఎత్తుగా ఉండి కాస్త చూడటానికి అసహ్యంగా కనపడటమే కాకుండా బయటకు వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడతారు.

belly fat reducing wonderful home remedy

అంతేకాక బాణ పొట్ట కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొండలాంటి బాణపొట్టను కరిగించడంలో మెంతులు బాగా సహాయపడతాయి. మెంతులతో తయారు చేసిన ఈ డ్రింక్ పొట్ట తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాణ లాంటి పొట్టను కరిగించే ఈ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

స్టౌవ్ పై మందపాటి కళాయి పెట్టి ఒక కప్పు మెంతులను వేయించి పొడిగా చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టీస్పూన్ మెంతుల పొడిని కలిపి తాగాలి. అదేవిధంగా పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి అర టీ స్పూన్ మెంతి పొడి, ఒక టీస్పూన్స్ తేనె, 3 టీస్పూన్స్ నిమ్మరసం కలిపి తాగాలి. ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఈ డ్రింక్ తాగితే మెటాబాలిజాన్ని వేగవంతం చేసి పొట్ట చుట్టూ కొవ్వును క‌రిగిస్తుంది.

Admin

Recent Posts