హెల్త్ టిప్స్

Betel Leaves : ఈ ఆకుల‌ను అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Betel Leaves : పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటం ఇలా దేనికైనా సరే మన భారత సంస్కృతిలో తమలపాకుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చేసిన తరువాత తాంబూలం వేసుకోవడం పూర్వీకుల కాలం నుంచి వస్తోంది. ఈ ఆకు ఆరోగ్యానికి రక్ష అని పెద్దలు అంటుంటారు. తమలపాకును పాన్ కా పట్టా అని కూడా అంటారు. తమలపాకు సుగంధాల మేళవింపుతో మంచి రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ ఆకులు అనేక పోషకాల ఉంటాయి.

తమలపాకును సంస్కృతంలో తాంబూలీ, నాగవల్లి, భక్షపత్ర అని కూడా అంటారు. ఇవి వగరు, కారం, తీపి రుచులు కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అధిక వేడి చేయకుండా శరీరాన్ని సమశీతోష్ణస్థితిలో ఉంచుతాయి. శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేయడంలో తమలపాకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు తమలపాకు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్, సి విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. తమలపాకును తాంబూలంగా తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతకంటే ఎక్కువగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.

betel leaves many wonderful health benefits

ఐదు లేత తమలపాకులను ముద్దగా నూరి ఒక కప్పు వేడి నీళ్లలో వేసి కలిపి కొద్దిగా ఉప్పు చేర్చి తాగితే బొదకాలు వ్యాధి నయమవుతుంది. అయితే దీనికి ముందుగా ఆయుర్వేద వైద్యుల సూచన తీసుకోవడం ఉత్తమం. అలాగే తమలపాకు తొడిమలను దంచి రసం తీసి రోజూ ఉదయం పూట కళ్ళలో ఒకటి రెండు చుక్కల రసం వేస్తూ ఉంటే క్రమంగా కంటి దురదలు, కురుపులు, నొప్పులు మాత్రమే కాకుండా రేచీకటి కూడా తొలగిపోయి మంచి చూపు వస్తుందని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇక తమలపాకు రసాన్ని తీసి వారానికి రెండు మూడు సార్లు ఒక పావు టీ స్పూన్ తమలపాకు రసంలో మరో పావు టీ స్పూన్ తేనె కలిపి పిల్లలకి పట్టిస్తే జలుబు, దగ్గు వంటివి దూరం అవుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా చంటి పిల్లలకైతే రెండు చుక్కల తమలపాకు రసాన్ని పట్టిస్తే ఉబ్బసం నయమవుతుందని ఆయుర్వేద నిపుణులు నిపుణులు వెల్లడిస్తున్నారు.

Admin

Recent Posts