హెల్త్ టిప్స్

Bhringraj Powder For Hair : దీన్ని రాస్తే చాలు.. మీ జుట్టు అస‌లు రాల‌దు.. వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Bhringraj Powder For Hair : చాలామంది, జుట్టు రాలిపోతోంది, విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. జుట్టు రాలిపోతున్నట్లయితే, ఇలా ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు. దీని వలన, చాలామంది బాధపడి, రకరకాల ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. ఖరీదైన వాటిని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, ఇవన్నీ కాకుండా ఈజీగా ఇంటి చిట్కాలతో, మనం ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అవుతుంది. ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరి పొడి జుట్టు ఆరోగ్యానికి కూడా, ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జుట్టుని దృఢంగా మార్చగలదు.

అలానే, వైట్ హెయిర్ ని కూడా ఇది కంట్రోల్ చేయగలదు. ఉసిరి పొడి ని మనం ఇంట్లో అయినా మనం తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని, రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉసిరి పొడి వేసుకోవాలి. అయితే, మీ జుట్టు పొడవుని బట్టి ఉసిరి పొడిని వేసుకోండి. ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళు, ఎక్కువ పౌడర్ ని వేసుకోవాల్సి ఉంటుంది. అలానే, మందారం పొడి కూడా తీసుకోవాలి. ఉసిరి పొడిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు మందారం పొడి వేసుకోండి.

Bhringraj Powder For Hair apply this for better growth

తర్వాత బృంగరాజ్ పౌడర్ ని కూడా వేసుకోండి. ఈ పొడులన్నీ కూడా సమాన క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఇప్పుడు, ఈ మూడింటిని కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం పెరుగు వేసి, బాగా మిక్స్ చేయండి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు, రైస్ వాటర్ లేదంటే నీళ్లు వాడుకోవచ్చు.

కొంచెం పెరుగు, కొంచెం రైస్ వాటర్ ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తల కి బాగా పట్టించి, తర్వాత ఆరిపోయిన తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వలన, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. స్మూత్ గా మారుతుంది. చక్కటి ఫలితం ఉంటుంది. ఈసారి ఇలా, మీరు మీ జుట్టుకి ఈ ప్యాక్ వేసుకుని, ట్రై చేయండి. అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు.

Admin

Recent Posts