Bitter Gourd Juice : కాక‌ర‌కాయ జ్యూస్‌ను అస‌లు రోజూ ఎంత మోతాదులో తాగాలో తెలుసా..?

Bitter Gourd Juice : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ కూడా ఒక‌టి. కాకర‌కాయ చేదుగా ఉన్న‌ప్ప‌టికి దీనిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కాక‌ర‌కాయ‌తో వేపుడు, కూర‌, పులుసు వంటి ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కాకర‌కాయ‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. కాక‌ర‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్యల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. అయితే కాకర‌కాయ‌ల‌ను కూర‌గా చేసి తీసుకోవ‌డం కంటే వాటితో జ్యూస్ ను చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

కాక‌ర‌జ్యూస్ ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. కాక‌ర‌కాయ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి..అలాగే ఈ జ్యూస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కాక‌ర‌కాయ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాకర‌కాయ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారు ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే కాకర‌కాయ‌లో విట‌మిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. వీటితో జ్యూస్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. కంటికి సంబంధించిన అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.

Bitter Gourd Juice how much we have to take daily
Bitter Gourd Juice

మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కాలేయం మ‌రియు మూత్ర‌పిండాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. ర‌క్తం శుద్ది అవుతుంది. గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. అలాగే ఈ కాక‌ర‌కాయ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య‌ఛాయ‌లు మన ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ విధంగా కాక‌రకాయ జ్యూస్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కాక‌ర‌కాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌ధ్య‌స్థంగా ఉండే రెండు కాక‌ర‌కాయల‌ను తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

త‌రువాత వీటిని జార్ లో వేసి కొద్దిగా ఉప్పు, అర చెక్క నిమ్మ‌ర‌సం వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మం నుండి 30ఎంఎల్‌ జ్యూస్ ను వేరు చేసుకోవాలి. త‌రువాత ఇందులో ఆపిల్ జ్యూస్ లేదా బెల్లం, తేనె క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. అయితే షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారు బెల్లం, తేనె ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఇలా త‌యారు చేసుకున్న కాక‌ర‌కాయ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts