Black Gram Laddu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినపప్పు కూడా ఒకటి. మినపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో మనం ఎక్కువగా ఇడ్లీ, దోశ, వడ వంటి అల్పాహారాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. మినపప్పుతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో పాటు మినపప్పుతో లడ్డూలను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని అలాగే శరీరానికి కావల్సిన పోషకాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మినపప్పుతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినపప్పు లడ్డూలను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మినపప్పును పొట్టుతో సహా వేయించి పొడిగా చేసుకోవాలి. తరువాత తగినంత బెల్లం తురుమును కూడా వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన మినపప్పు లడ్డూలను రోజూ ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న మినపప్పు లడ్డూలను తినడం వల్ల శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. నీరసం, బలహీనత వంటివి దరి చేరకుండా ఉంటాయి. ఈ లడ్డూలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ మినపప్పు లడ్డూలను తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి. ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. అలాగే ఈ లడ్డూలల్లో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు ఈ లడ్డూలను తినడం వల్ల రక్తహీనత సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. ఈ విధంగా మినప లడ్డూలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.