హెల్త్ టిప్స్

Broad Beans : షుగ‌ర్‌, అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు.. ఈ కాయ‌ల ముందు మ‌టుమాయం కావ‌ల్సిందే..!

Broad Beans : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో చిక్కుడు కాయ‌లు కూడా ఒక‌టి. గ్రామీణ ప్రాంతాల్లో లావుపాటి గింజ‌లు ఉండే చిక్కుళ్లు ల‌భిస్తాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇత‌ర ప్రాంతాల్లోనూ ప‌లు ర‌కాల వెరైటీల‌కు చెందిన చిక్కుడు కాయ‌లు ల‌భిస్తాయి. అయితే వేటిని తిన్నా స‌రే మ‌న‌కు చిక్కుడు కాయ‌ల వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చిక్కుడు కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మయ్యే అతి ముఖ్య‌మైన పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, ఫోలేట్‌, విట‌మిన్ కె, విట‌మిన్ బి6, సి, ఐర‌న్‌, మాంగ‌నీస్‌, కాప‌ర్‌, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పోష‌కాహార లోపం ఏర్ప‌డ‌నీయ‌వు. ఈ కాయ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఈ కాయ‌ల్లో ఉండే ఫోలేట్, విట‌మిన్ బి6 గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి.

broad beans many benefits

చిక్కుడు కాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవడం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఈ కాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ షుగ‌ర్‌ను త‌గ్గిస్తుంది. దీంతో డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. ఇది షుగ‌ర్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేసే విష‌యం. చిక్కుడు కాయ‌ల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే వీటిని త‌క్కువ తిన్నా చాలు.. క‌డుపు నిండిపోతుంది. దీంతో ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు మేలు చేస్తుంది. ఇక ఈ కాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. జీర్ణాశ‌యం ఆరోగ్యంగా ఉంటుంది.

చిక్కుడు కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్లు రాకుండా చూస్తాయి. ఈ కాయ‌ల్లో మాంగ‌నీస్‌, కాప‌ర్‌, ఐర‌న్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఈ కాయ‌ల్లో అధికంగా ఉండే విట‌మిన్ కె శ‌రీరం కాల్షియంను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముక‌లు గట్టిప‌డ‌తాయి. ఈ కాయ‌ల్లో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. కండ‌రాల పెరుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. ఇలా చిక్కుడు కాయ‌ల‌తో మ‌నం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

Admin

Recent Posts