హెల్త్ టిప్స్

Japanese Water Therapy : జ‌ప‌నీస్ వాట‌ర్ థెర‌పీ గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Japanese Water Therapy : మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే, మనం షాక్ అవుతూ ఉంటాము. సాధారణంగా బరువు తగ్గాలంటే, ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి తెలుసు. కానీ, వాటర్ థెరపీ గురించి తెలిసి ఉండదు. నిజానికి వాటర్ థెరపీ గురించి చాలా మందికి తెలియదు. బరువు తగ్గడానికి, వాటర్ థెరపీ ఒక మార్గం. ఇక మరి, జపనీస్ వాటర్ థెరపీ గురించి చూసేద్దాం.

గతం తో పోలిస్తే, ఇప్పుడు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా అందరూ కూడా ఉబకాయంతో బాధపడుతున్నారు. దీంతో, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డ్రింక్స్, పౌడర్స్ వంటివి తీసుకుంటున్నారు. జపనీస్ వాటర్ థెరపీ చాలా చక్కగా పనిచేస్తుంది. జపాన్ లోని ప్రజలు బరువును తగ్గడానికి ఈ థెరపీ ని ఫాలో అవుతున్నారు. జపనీస్ వాటర్ థెరపీ అంటే అసలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Japanese Water Therapy do you know about it

పేగులు ఆరోగ్యంగా లేకపోతే, సర్వరోగలు వస్తాయి. వాటర్ థెరపీ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా, ఇది పేగుల్ని క్లీన్ చేస్తుంది. దీంతో జీర్ణక్రియ శక్తివంతమైపోతుంది. జీవక్రియ మెరుగుపడడంతో, శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. బరువు తగ్గాలని అనుకుంటే, నీటిని మాత్రమే రోజు తాగాలి. కేవలం నీళ్లు మాత్రమే తాగి, ఉదయం ఏమీ తినకుండా ఉండాలి. లేవగానే నాలుగు నుండి ఐదు గ్లాసుల వరకు నీళ్లు తాగాలి.

ఆ తర్వాత అల్పాహారం అరగంట తర్వాత తీసుకోవాలి. ఉండగలిగిన వాళ్ళు 24 గంటలు 36 గంటల దాకా నీటి మీదే ఉండవచ్చు. ఒకవేళ కనుక ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే, ఉదయాన్నే నీళ్లు తాగాక, మధ్యాహ్నం ఆహారం తీసుకోవచ్చు. ఒకసారి ఆహారం తీసుకున్నాక, మళ్ళీ తినడానికి రెండు గంటలైనా ఆగాలి. ఇలా, ఈ వాటర్ థెరపీ తో ఈజీగా బరువు తగ్గవచ్చు. గోరువెచ్చని నీళ్లు తాగితే, జీర్ణాశయంలో పేగుల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. జపనీస్ గోరువెచ్చని నీళ్లు తాగి కొవ్వుని కరిగించుకుని, బరువు తగ్గుతారు.

Admin

Recent Posts