Milk : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో పాల‌ను తాగ‌వ‌చ్చా.. పాల‌ను ఎప్పుడు తాగాలి..?

Milk : మ‌నం పాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలల్లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. పాలు సంపూర్ణ ఆహార‌మ‌ని వీటిని ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు అంద‌రూ కూడా ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ పాల‌ను ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. మ‌న‌లో చాలా మంది కూడా వారికి న‌చ్చిన స‌మ‌యంలో, వీలుని బ‌ట్టి రోజూ పాల‌ను తాగుతూ ఉంటారు. అయితే పాల‌ను ఎప్పుడు తాగితే మంచిది.. అనే సందేహం కూడా మ‌న‌లో చాలా మందికి ఉంది… పాల‌ను ఏ స‌మ‌యంలో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌రింత మేలు క‌లుగుతుంది.. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే మేలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొంద‌రు పాల‌ను ఉద‌యం పూట తాగుతారు. కొంద‌రు రాత్రి ప‌డుకునే ముందు తాగుతూ ఉంటారు. కొంద‌రు సాయంత్రం స‌మ‌యాల్లో తాగుతూ ఉంటారు. అయితే పాల‌ను ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం పూట తీసుకునే ఆహారమే మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని క‌నుక పాల‌ను కూడా ఉద‌యం పూట‌నే తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం పూట అల్పాహారంలో కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి.

can we take milk in breakfast what is the time to take
Milk

పాల‌ల్లో కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి క‌నుక పాల‌ను మ‌నం ఉద‌యం పూట‌నే ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే చాలా మంది ఉద‌యం పూట మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇలా గింజ‌ల‌ను ఆహారంగా తీసుకునే వారు వాటితో పాటు పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సినంత క్యాల్షియం ల‌భిస్తుంది. ఎముకలు, దంతాలు గ‌ట్టిగా మార‌తాయి. ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

ఎదిగే పిల్ల‌ల‌కు పాల‌ను ఆహారంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. అలాగే పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్స్, ఫాస్ప‌ర‌స్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, విట‌మిన్ ఎ , బి 12, రైబో ప్లేవిన్ వంటి పోష‌కాలు కూడా కొద్ది మొత్తంలో మ‌న శ‌రీరానికి అందుతాయి. శ‌రీరం బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. అంతేకాకుండా పాల‌ను తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు పూర్తి మొత్తంలో అంద‌న‌ప్ప‌టికి వాటిని పాలు కొంత‌మేర భ‌ర్తీ చేయ‌గ‌ల‌వు. ఈ విధంగా పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని రోజూ ఉద‌యం పూట తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts