Cholesterol And Weight Reduce Technique : మన ఎత్తు, బరువు, రంగు మన తల్లిదండ్రుల నుండి జన్యుపరంగా వస్తాయి. అలాగే మన శరీరంలో కొవ్వు పేరుకునే భాగాలు కూడా జన్యుపరంగా ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తూ ఉంటాయి. కొందరు పురుషుల్లో కొవ్వు నడుము చుట్టూ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ఛాతి, కాళ్లు సన్నగా ఉంటాయి. పురుషుల్లో కొవ్వు కణాలు నడుము చుట్టూ, పొట్ట చుట్టూ ఎక్కువగా ఉంటాయి. అందుకే వారు బరువు పెరిగినప్పుడు పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. అదే స్త్రీలల్లో ఈ కొవ్వు కణాలు పురుషులతో పోలిస్తే నడుము చుట్టూ తక్కువగా ఉంటాయి. స్త్రీలల్లో ఎక్కువగా పిరుదుల భాగంలో కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక స్త్రీలు బరువు పెరిగినప్పుడు పిరుదుల భాగం కొవ్వు పేరుకుపోయి పెద్దగా కనిపిస్తుంది. అలాగే కొందరుస్త్రీలల్లో నడుము సన్నగా ఉండి పిరుదుల భాగం ఎక్కువగా ఉంటుంది. ఇదిమనం చూస్తు ఉంటాము కూడా. జన్యుపరమైన కారణాల వల్ల ఇలా జరుగుతుంది.
ఇలా నడుము చుట్టూ, పిరుదుల భాగంలో కొవ్వు పేరుకుపోయిన వారు ఆయా భాగాలను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మంది వ్యాయామాలు, ఆసనాలు చేసి విసుగు చెంది మానేస్తూ ఉంటారు. కొందరు ఆశించిన ఫలితాలు రావడం లేదని మానేస్తూ ఉంటారు. కొందరు చేయడానికి తోడు లేదని మానేస్తూ ఉంటారు. ఇలా వివిధ కారణాల వల్ల వ్యాయామం చేయడం మానేసే వారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సూర్య నమస్కారాలు ఎవరికి వారే చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల నడుము చుట్టూ, పిరుదుల భాగంలో ఉండే కొవ్వు కరిగి అవి చాలా సన్నగా అవుతాయి. 12 భంగిమలను ఒక దాని తరువాత ఒకటి చేయడం వల్ల ఒక సూర్య నమస్కారం అవుతుంది. దీంతో మన ఏకాగ్రత అంతా కూడా దానిపైనే ఉంటుంది. ఎవరు తోడు లేకపోయినా కూడా ఈ సూర్యనమస్కారాలు మనం సులభంగా చేయవచ్చు. అలాగే వీటిని చేయడం వల్ల ఎటువంటి విసుగు కూడా రాదు.
సూర్యనమస్కారాలు చేయడం వల్ల పొట్ట, నడుము, తొడలు, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరుగుతుంది. చాలా సులభంగా మనం బరువు తగ్గవచ్చు. అలాగే వీటిని మొదటిసారి చేసే వారు ఒక్కో రోజుకు ఒక్కో సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలి. మొదటి నాలుగు లేదా ఐదు రోజులు కొద్దిగా శరీరంలో నొప్పులు వచ్చినప్పటికి ఇవి క్రమంగా మనకు అలవాటైపోతాయి. ఇలా ఒంటి నొప్పులు వచ్చినప్పుడు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. రోజూ ఇలా సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీర బరువు తగ్గడంతో పాటు శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా సులభంగా కరిగిపోతుంది. ఇతర వ్యాయామాలు చేయలేని వారు ఇలా సూర్యనమస్కారాలు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.