Cinnamon Water : దాల్చిన చెక్క నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cinnamon Water : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దాల్చిన చెక్క ఘాటైన వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. దీనిని మ‌నం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. ముఖ్యంగా మ‌సాలా వంట‌కాల్లో దీనిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. దాల్చిన చెక్క వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్క‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే దీనిని వంటల్లో వాడ‌డానికి బ‌దులుగా దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున దాల్చిన చెక్క నీటిని తాగ‌డం వ‌ల్ల మనం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ఇలా ఉద‌యం పూట ప‌ర‌గ‌డుపున దాల్చిన చెక్క టీని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. దాల్చిన చెక్క నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ బ‌యాటిక్, యాంటీ వైర‌ల్ గుణాలు శ‌రీరాన్ని ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ప‌ర‌గ‌డుపున ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. క‌డుపు ఉబ్బ‌రం,గ్యస్, క‌డుపులో నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది.

Cinnamon Water health benefits in telugu
Cinnamon Water

మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దాల్చిన చెక్క నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ముఖ్యంగా స్ల్రీలల్లో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి సమ‌స్య‌లు త‌గ్గుతాయి. నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే పొత్తి క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. అలాగే వ్యాయామం చేసిన త‌రువాత ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల కండ‌రాలు విశ్రాంతికి గురి అవుతాయి. కండ‌రాల్లో మంట వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా దాల్చిన చెక్క నీరు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని దాల్చిన చెక్క నీటిని ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts