Cloves : రోజూ ప‌ర‌గ‌డుపునే ల‌వంగాల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే సుగంధ ద్ర‌వ్యాల‌లో ల‌వంగాలు కూడా ఒక‌టి. వీటిని వంట‌ల‌లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంటల‌ రుచి, వాస‌న పెరుగుతాయి. ల‌వంగాలు వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ల‌వంగాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ల‌వంగాల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో పుష్క‌లంగా ఉంటాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, మెద‌డు ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో ల‌వంగాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి.

వీటిలో ఉండే గ్లిస‌నాల్ అనే స‌మ్మేళ‌నం శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించి క‌ణాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. ల‌వంగాల‌లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మ‌నం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఇవి యాంటీ మైక్రో బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ల‌వంగాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి, అతిసారం వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రిచేర‌కుండా ఉంటాయి. అంటు వ్యాధుల‌కు కార‌ణ‌మ‌య్యే బాక్టీరియాలను నిరోధించే శ‌క్తిని ల‌వంగాలు క‌లిగి ఉంటాయి. టీ ట్రీ నూనెను, ల‌వంగాల‌ను క‌లిపి ఉప‌యోగించ‌డం వ‌ల్ల దంతాల స‌మ‌స్య‌లు, చిగుళ్ల స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అంతేకాకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, కాలేయ ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ల‌వంగాలు మ‌న‌కు ఉప‌యోగ‌న‌డ‌తాయి.

Cloves are very beneficial when taken on empty stomach
Cloves

షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ల‌వంగాలు ఎంతో మేలు చేస్తాయి. ఇన్సులిన్ ఉత్ప‌త్తిని పెంచి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో ఇవి ఎంతో తోడ్ప‌డ‌తాయి. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు రోజూ ఉద‌యం 6 లేదా 7 ల‌వంగాల‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి 15 నిమిషాల పాటు వేడి చేసి ఆ నీటిని వడక‌ట్టి రోజూ ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కూడా ల‌వంగాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ల‌వంగాల నుండి తీసిన నూనెను నొప్పులు ఉన్న చోట‌ రాసి మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల నొప్పులు త‌గ్గుతాయి. ఈ నూనె అందుబాటులో లేని వారు ల‌వంగాల‌ను మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని నొప్పుల‌పై రాయ‌డం వ‌ల్ల కూడా కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. రోజూ ఒక టీ స్పూన్ ల‌వంగాల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌ల ప‌గుళ్లు రాకుండా ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

పంటి నొప్పితో బాధ‌ప‌డే వారు కొన్ని ల‌వంగాల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల నొప్పి తీవ్ర‌త త‌గ్గుతుంది. ల‌వంగాలు యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. వీటిని పేస్ట్ గా చేసి కాలిన గాయ‌లాపై, తెగిన గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల ఆ గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. క‌డుపులో అంత‌ర్లీనంగా ఉండే ర‌క్ష‌ణ పొర కొన్నిసార్లు దెబ్బ‌తిని అల్స‌ర్లు ఏర్ప‌డ‌తాయి. ల‌వంగాల నూనెను వాడ‌డం వ‌ల్ల ఈ అల్స‌ర్లు త‌గ్గ‌డ‌మే కాకుండా క‌డుపులో ఉండే ర‌క్ష‌ణ పొర దెబ్బ‌తిన‌కుండా కాపాడుతుంది. కొంద‌రికి ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవుతాయి. అలాంటి వారు ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ ఉండ‌డం వ‌ల్ల వాంతులు అవ్వ‌కుండా ఉంటాయి. ఈ విధంగా ల‌వంగాలు మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డంలో మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts