హెల్త్ టిప్స్

Coconut Tea : గ్రీన్ టీ లాగే కొబ్బ‌రి టీ.. దీన్ని తాగితే ఎన్నో లాభాలు.. ఎలా చేసుకోవాలంటే..?

Coconut Tea : కొబ్బరికాయ వలన కూడా ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. కొబ్బరికాయతో మనం పచ్చడి వంటివి చేసుకుంటూ ఉంటాం. అయితే కొబ్బరి టీ గురించి చాలామందికి తెలియదు. కొబ్బరి టీ తాగడానికి రుచిగా ఉంటుంది. పైగా కొబ్బరి టీ వలన చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చు. కొబ్బరి టీ ని గ్రీన్ లేదా బ్లాక్ టీ తో పాటు తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

కొబ్బరి టీ తాగితే పలు రకాల సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చు. కొబ్బరిలో సంతృప్త కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, లారిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఉంటాయి. శారీరిక ఆరోగ్యానికి ఈ పోషకాలు చాలా ముఖ్యం. కొబ్బరిని ఏ రూపంలో తీసుకున్నా మనకి పోషకాలు బాగానే అందుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి కొబ్బరి టీ బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కొబ్బరి టీ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

coconut tea wonderful health benefits how to make it

కొబ్బరి టీ ని తీసుకున్నట్లయితే బరువు కూడా తగ్గ‌వ‌చ్చు. కొబ్బరి టీ ని తీసుకోవడం వలన కొవ్వు తగ్గుతుంది. కొబ్బరి టీ వలన మనం గుండె జబ్బులకి కూడా దూరంగా ఉండొచ్చు. కొబ్బరి టీ ని ఇక ఎలా చేసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే.. కొబ్బరి టీ చేయడానికి ఒక పాత్రలో నాలుగు కప్పుల‌ నీళ్లు పోసి బాగా మరిగించండి. మూడు టీ బ్యాగులని అందులో వేసేయండి. అరకప్పు కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్ల‌ క్రీమ్ వేసి, గ్రీన్ టీ బ్యాగ్స్ తొలగించేయండి. ఇలా ఈజీగా మనం ఈ టీ తయారు చేసుకోవచ్చు. కొబ్బరి టీ ని తీసుకోవడం వలన జీర్ణ క్రియ సమస్యలకి చెక్ పెట్ట‌వ‌చ్చు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు.

Admin

Recent Posts