కొబ్బరి నీళ్లు మన శరీరానికి ఎంత ఆరోగ్యకరమైనవో అందరికీ తెలిసిందే. వీటితో మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ప్రధానంగా మినరల్స్ మనకు దొరుకుతాయి. దీంతో శరీరం ఉల్లాసంగా ఉంటుంది. అదేవిధంగా తేనె… తేనెలో కూడా ఎన్నో ప్రధానమైన విటమిన్లు ఉన్నాయి. ఇది సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ కారకంగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఉదయాన్నే ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకుని పరగడుపునే తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ కూడా సమృద్ధిగా ఉంటుంది. దీంతో ఈ మిశ్రమం యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేస్తుంది. అంటే వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమాన్ని నిత్యం తాగుతుంటే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు పోతాయి. అల్సర్లు ఉంటే నయమవుతాయి. ఈ మిశ్రమంలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇది కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను పారదోలుతుంది. దీంతోపాటు ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.
శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతో అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది. కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమంలో ఔషధ గుణాలు మెండుగా ఉండడం వల్ల అది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కిడ్నీలు శుభ్రమవుతాయి. వాటిలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి.