Copper Water : మానవుడు మొదటిగా కనుగొని వాడిన లోహం రాగి. చాలా కాలం నుండి మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూ ఉన్నాం. దీనిని తామ్రము అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిని తామ్ర జలం అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్ లో దీనిని కాపర్, క్యూప్రమ్ అని పిలుస్తూ ఉంటారు. రాగి పాత్రలను ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
రాగి పాత్రలను వాడడం వల్ల కఫం, పైత్యం వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక స్థితి మెరుగుపడుతుంది. మూల వ్యాధి, క్షయ వంటి రోగాలు నయం అవుతాయి. శరీరానికి బలాన్ని చేకూర్చడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా రాగి ఉపయోగపడుతుంది. నీటిలో ఉండే బాక్టీరియాను నశింపజేసే శక్తి కూడా రాగికి ఉందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో లేదా రాగి పాత్రలో నీళ్లను పోసి 4 తులసి ఆకులను వేసి ఉంచాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున తులసి ఆకులను తీసేసి ఒక గ్లాసు మోతాదులో ఈ నీటిని తాగడం వల్ల కొద్ది రోజులలోనే శరీరం అనారోగ్య రహితంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. నీటిలో ఉండే ఫ్లోరైడ్ వంటి వాటిని తొలగించడంలో తులసి ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. ఆయుర్వేద నిపుణులు ఔషధాల తయారీలో తామ్ర భసాన్మి ఉపయోగిస్తుంటారు. మామూలు తామ్ర జలం కన్నా తులసి ఆకులు వేసిన తామ్ర జలాన్ని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. తామ్ర జలాన్ని తగాడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు నల్లగా, పొడువుగా పెరుగుతుంది. అధిక బరువుతో బాధపడే వారు రోజూ ఈ నీటిని తాగడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మగ వారిలో వీర్య కణాల నాణ్యతను, వాటి సంఖ్యను పెంచడంలో కూడా తామ్రజలం ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.