Cumin And Fenugreek Water : ప్రస్తుత కాలంలో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది బాధపడుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వంటి వివిధ రకాల కారణాల చేత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. పొట్ట చుట్టూ పేరుకుపోవడం వల్ల మనం ఇతరత్రా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం వీలైనంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడాలి. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాలా సులభంగా కరిగించుకోవచ్చు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక టీ స్పూన్ జీలకర్రను, ఒక టీ స్పూన్ మెంతులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ నీళ్లల్లో జీలకర్ర, మెంతులు వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత ఈ నీటిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత ఈ కషాయాన్ని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని పిండాలి. తరువాత రుచికి తగినంత తేనెను వేసుకోవాలి. అయితే డయాబెటిస్ తో బాధపడే వారు తేనెను వేసుకోకూడదు. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఈ విధంగా కషాయాన్ని తాగుతూనే కొవ్వు పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. జంక్ ఫుడ్ కు, నూనె పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
ఇలా చేయడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు మనం ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.