Curry Leaves Water : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది సర్వసాధారణమైన అనారోగ్య సమస్యగా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే మనల్ని ఈ సమస్య బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. చాలా మంది ఈ సమస్య బారిన పడగానే జీవితం మీద ఆశ కోల్పోతారు. జీవితం ఒక వృధా అన్నట్టుగా బాధపడి పోతుంటారు. అయితే మందులను వాడుతూ ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదు. ఇలా మందులను, ఆహార నియమాలను పాటిస్తూనే మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటాము.
అలాగే ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో డయాబెటిస్ బారిన పడుండా ఉంటాము. డయాబెటిస్ ను అదుపులో ఉంచే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. డయాబెటిస్ ను నియంత్రించడంలో మెంతులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మెంతులను వాడడం వల్ల డయాబెటిస్ తో పాటు కీళ్ల నొప్పులు, అధిక బరువు, గాయాలు, దద్దుర్లు, మలబద్దకం, మూత్రాశయ సమస్యలు వంటి ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. తరువాత ఈ నీటిలో రెండు రెమ్మల కరివేపాకును శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కరివేపాకును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరువాత ఈ నీటిలో ఒక ఇంచు అల్లం ముక్కను కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. అల్లాన్ని వాడడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. చివరగా ఈ నీటిలో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. దాల్చిన చెక్క చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో దివ్యౌషధంగా పని చేస్తుంది. దీనిలో ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కను వాడడం వల్ల మధుమేహం వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇప్పుడు ఈ నీటిని ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి.
తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. దీనిలో ఎటువంటి ఇతర పదార్థాలను కలుపుకోకూడదు. ఈ పానీయాన్ని తాగిన తరువాత అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా ప్రతిరోజూ ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.