Diabetes : ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని వేధిస్తున్న ప్రధాన అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైన అనారోగ్య సమస్యగా మారింది. షుగర్ కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి బారిన పడడానికి ప్రధాన కారణం మన శరీరంలో ప్రాంకియాసిస్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడమే. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఒత్తిడి, ఆందోళన, డిఫ్రెషన్ , తగినంత వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం వంటి వాటినే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. షుగర్ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులను వాడాల్సిందే.
అయితే ఈ మందులను ఎక్కువగా వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ మందులను వాడడం వల్ల తల తిరిగినట్టు ఉండడం, కడుపు ఉబ్బరం, గ్యాస్, శరీరంలో విటమిన్ బి 12 లోపం తలెత్తడం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మందులు వాడినప్పటికి కొందరిలో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండదు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఈ చిట్కాను పాటించడం వల్ల మనం భవిష్యత్తులో కూడా షుగర్ రాకుండా చూసుకోవచ్చు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాంకియాసిస్ గ్రంథిని ఉత్తేజపరచడం వల్ల మనం షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. మన చేతిలో ఉంగరం వేలు, చిటికెన వేలు కింది భాగాన మధ్యలో ప్రాంకియాసిస్ గ్రంథి యొక్క ప్రెషర్ పాయింట్ ఉంటుంది.
ఈ ప్రెషర్ పాయింట్ మీద వత్తుతూ ఉండడం వల్ల ప్రాంకియాసిస్ గ్రంథి యొక్క పనితీరు మెరుగుపడుతుంది. దీంతో మనం షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కొందరిలో ఈ ప్రెషర్ పాయింట్ మీద వత్తినప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి గ్రంథి పనితీరు సక్రమంగా లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఉంగరం వేలు, చిటికెన వేలు మధ్య భాగాన ఒత్తిడిని కలగజేయడం వల్ల షుగర్ వ్యాధి అదుపులోకి రావడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల క్రమంగా షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. దీంతో మనం వాడే మందుల మోతాదు కూడా తగ్గుతుంది. దీంతో మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల బారిన కూడా మనం పడకుండా ఉంటాము.
ఈ చిట్కాను పాటిస్తూనే పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. చక్కటి జీవన విధానాన్ని పాటించాలి. తెల్లబియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల అన్నం తిన్న భావన కలగడంతో పాటు షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధి బారిన పడిన వారు అలాగే భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలనుకునే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.