హెల్త్ టిప్స్

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేస్తే హ్యాప్పీగా జీవించ‌వ‌చ్చు..!

షుగర్ వ్యాధి వున్న వారికి ఆహారం సమస్యగా వుంటుంది. వీరి ఆహారం ఇంటిలో అందరూ తినే రకంగా కాకుండా ప్రత్యేకించి తయారు చేయటం కూడా జరుగుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులోకి తీసుకువచ్చి అందరి వలెనే ఏ ఆరోగ్య సమస్యా లేకుండా కూడా జీవించవచ్చు. షుగర్ వ్యాధి రోగులు ప్రొటీన్లు అధికంగా వుండి కొవ్వు తక్కువగా వుండే బీన్స్, సోయాబీన్స్, టోఫు, కాయధాన్యాలవంటివి అధికంగా తీసుకోవాలి.

షుగర్ వ్యాధి రోగులకు గ్రీన్ టీ తాగటం మంచిది. సాధారణ బియ్యం కంటే కూడా బ్రౌన్ రైస్, గోధుమ, లేదా బార్లీ వంటివి వ్యాధిని నియంత్రణలో వుంచుతాయి. ప్రతిరోజూ తినే ఆహారంలో కార్బోహైడ్రట్లు అధికంగా లేకుండా వీరు చూసుకోవాలి. ప్రతిరోజూ నడక లేదా ఎరోబిక్స్ వంటి సులభ వ్యాయామాలు రోగ లక్షణాలు లేకుండా శరీరాన్ని ఫిట్ గా వుంచుతాయి.

diabetic patients do like this for happy life

తినటం అవసరం, కాని తెలివిగా ఎంపిక చేసిన ఆహారాలు తిని ఆరోగ్యంగా వుండటం ఒక కళ. ఏ ఆహారాలు అధికంగా తినాలి? వేటిని తక్కువ తినాలి అనేది గ్రహించాలి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చేసేటంతవరకు ఎవరూ ఆహారం గురించి పట్టించుకోరు. సమస్య వచ్చిన తర్వాత వైద్యులు మందులతోపాటు ఆహార జాగ్రత్తలు చెపితే వాటిని పాటిస్తారు.

Admin

Recent Posts