చిన్న ట్రిక్ – లావుగా వున్నవారికి బరువు తగ్గటమంటే ఎంతో ఆరాటం. బరువు ఎలా తగ్గాలి ? అనే పుస్తకం ఎక్కడదొరికినా చదివేస్తారు. అందులో వున్నట్లు ఆహారంలో కోత పెడతారు, జిమ్ లకు వెళతారు లేదంటే చివరకు పూర్తి ఉపవాసాలు కూడా చేస్తారు. అన్నిటికంటే సులభమైన చిన్న ట్రిక్…..ఒకటి పాటించండి…అంటోంది తాజాగా చేయబడిన రీసెర్చి ఒకటి. రీసెర్చి ఏమంటోంది? – అదేమిటంటే….సరిగ్గా భోజనానికి ముందర…ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగితే అది ఆకలి చంపి మీ బరువు సమర్ధవంతంగా తగ్గిస్తుందంటున్నారు.
8 ఔన్సు గ్లాసుల నీరు భోజనం ముందర తీసుకుంటే వెయిట్ లాస్ ఖచ్చితంగా వుంటుందిట. 12 వారాలపాటు రోజుకు మూడు సార్లు ఈ రకంగా నీరు తాగినవారు 5 పౌండ్ల బరువు తగ్గినట్లు బ్లాక్ బర్గ్ లోని వర్జినీయా టెక్ విశ్వవిద్యాలయంలో అధ్యయన కర్త బ్రెండా డేవీ తెలిపారు. ఎవరెంత తాగాలి? – నీరు తాగటం వెనుకగల లాజిక్ చాలా సరళమైంది.
జీరో కేలరీలు కల నీరు ముందుగా పొట్ట నింపేస్తుంది. కడుపు నిండిందని భావిస్తూ వారిక తక్కువ తిండి తింటారు. నీటితోపాటు కూల్ డ్రింక్ ల వంటివి కూడా ఈ ట్రిక్ లో బాగా పనిచేస్తయని కూడా తెలుపుతున్నారు. నీరు ఖచ్చితంగా ఇంతే తాగాలని లేదు. ఎవరికెంత అవసరమనిపిస్తే అంత తాగవచ్చు. అయితే, మహిళలకు మాత్రం నీరు, ఇతర కూల్ డ్రింకులు అన్ని కలిపి 9 కప్పుల ద్రవాలు గా, పురుషులకు 13 కప్పులుగా రోజూ వుంటే మాత్రం చాలని రీసెర్చర్లు సిఫార్సు చేస్తున్నారు. అయితే వీటిని భోజనానికి 30 నిమిషాల ముందు తాగాల్సి ఉంటుంది.