Diet In Fever : జ్వ‌రం వ‌చ్చి త‌గ్గిందా.. అయితే ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ కొద్ది రోజులు తిన‌కూడ‌దు..!

Diet In Fever : మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో జ్వ‌రం కూడా ఒక‌టి. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల వ‌చ్చే ఈ జ్వ‌రం అంత ప్ర‌మాద‌క‌రం కాక‌పోయినా మ‌న‌ల్ని అస్వ‌స్థ‌త‌కు గురి చేస్తుంది. త‌ల‌నొప్పి, నీర‌సం, నొప్పులు, ఆక‌లిలేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. త‌గిన విశ్రాంతి, మందులు తీసుకోవ‌డం వ‌ల్ల జ్వరం త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. అయితే మందుల‌తో పాటు జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌నం తీసుకునే ఆహార విష‌యంలో కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల జ్వ‌రం మ‌రింత త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. అలాగే జ్వ‌రం త‌గ్గిన త‌ర్వాత వ‌చ్చే నీరసం కూడా త‌గ్గిపోతుంది. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారంతో పాటు సుల‌భంగా జీర్ణ‌మ‌య్యే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఈ స‌మ‌యంలో కొన్ని ఆహారాల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు.. ఎటువంటి ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు పాలు, పెరుగు వంటి పాల ఉత్ప‌త్తుల‌ను తీసుకోకూడ‌దు. కొంద‌రిలో ఇవి శ్లేష్మాన్ని పెంచుతాయి. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, క‌ఫం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే తీపి ప‌దార్థాల‌ను, శీత‌ల పానీయాల‌ను కూడా తీసుకోకూడ‌దు. ఇవి శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని త‌గ్గిస్తాయి. శ‌రీరంలో ఇన్పెక్ష‌న్ తో పోరాడే క‌ణాల‌ను అడ్డుకుంటాయి. శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ ను మ‌రింత‌గా పెంచుతాయి. ఇవే కాకుండా మాంసం వంటి వాటిని కూడా తీసుకోకూడ‌దు. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

Diet In Fever must know which foods to avoid
Diet In Fever

అలాగే జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు తృణ ధాన్యాలు, బీన్స్ తో పాటు అధిక ఫైబ‌ర్ ఉండే ఆహారాల‌కు కూడా దూరంగా ఉండాలి. ఇవి జీర్ణం అవ్వ‌డానికి స‌మ‌యాన్ని ఎక్కువ‌గా తీసుకుంటాయి. దీంతో క‌డుపులో అసౌక‌ర్యం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అలాగే నిమ్మ‌జాతికి చెందిన పండ్లను కూడా ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. ఇవి జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఉండే గొంతునొప్పి, వికారం వంటి ల‌క్ష‌ణాల‌ను మ‌రింత ఎక్కువ చేస్తాయి. అదే విధంగా కాఫీ వంటి వాటిని కూడా ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. వీటిలో ఉండే కెఫిన్ నిద్ర‌కు ఆటంకాన్ని క‌లిగిస్తుంది. దీంతో మ‌నం త‌గిన విశ్రాంతి తీసుకోలేక‌పోతాము. అలాగే ఆల్కాహాల్ ను కూడా తీసుకోకూడ‌దు.

ఆల్క‌హాల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి తగ్గుతుంది. అలాగే నూనెలో వేయించిన ఆహారాల‌ను, ప్రాసెస్ట్ ఆహారాల‌ను, మ‌సాలా ఎక్కువ‌గా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడ‌దు. దీనిలో ఉండే కొవ్వులు జీర్ణ‌క్రియ‌ను క‌ష్ట‌త‌రం చేస్తాయి. వీటికి బ‌దులుగా జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు పండ్లు, కూర‌గాయ‌లు, లీన్ ప్రోటీన్ ఉంటే ఆహారాల‌ను తీసుకోవాలి. శ‌రీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. నీటిని ఎక్కువ‌గా తాగాలి. ఇలా జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌గిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, జ్వ‌రం నుండి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts