Garlic : స్త్రీలు, పురుషులు.. వెల్లుల్లిని తిన‌డంలో ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

Garlic : వెల్లుల్లిని మ‌నం ఎప్ప‌టి నుంచో ఉపయోగిస్తున్నాం. దీన్ని రోజూ మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. ఇవి లేకుండా వంట‌లు పూర్తి కావు. ఇవి చ‌క్క‌ని వాస‌న‌ను, రుచిని క‌లిగి ఉంటాయి. క‌నుక వీటిని కాస్త దంచి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో కూర‌ల‌కు చక్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. ఇలా వెల్లుల్లిని కూర‌ల్లో వేస్తే ఇష్టంగా తినేవారు చాలా మందే ఉంటారు. అయితే వాస్త‌వానికి వెల్లుల్లిని ప‌చ్చిగానే తినాల‌ని నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లిని రెండు రెబ్బ‌లు తీసుకుని దంచాలి. లేదా క‌త్తితో చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. అనంత‌రం వాటిని అలాగే కాసేపు వ‌దిలేయాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక వాటిని తినాలి. ఇలా వెల్లుల్లిని దంచి లేదా క‌ట్ చేశాక కాసేపు అలాగే ఉంచితే వాటిల్లో మ‌న‌కు అవ‌స‌ర‌మైన ఎన్నో స‌మ్మేళ‌నాలు రిలీజ్ అవుతాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. అయితే ఈ స‌మ్మేళ‌నాలు ఉడ‌క‌బెట్టిన లేదా వేయించిన వెల్లుల్లిలో ఉండ‌వు. క‌నుక వెల్లుల్లి ద్వారా ఎక్కువ ఫ‌లితం పొందాల‌నుకునే వారు వాటిని దంచి లేదా క‌ట్ చేసి తినాల్సి ఉంటుంది.

do not make mistakes while taking Garlic
Garlic

అయితే వెల్లుల్లి కాస్త ఘాటుగా ఉంటుంది. అందువ‌ల్ల అంద‌రూ దాన్ని నేరుగా తిన‌లేరు. అలాంటి వారు వెల్లుల్లిని తేనెతో క‌లిపి తిన‌వ‌చ్చు. దీంతో కాస్త ఘాటు త‌గ్గుతుంది. ఇలా వెల్లుల్లిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వెల్లుల్లి కొంద‌రికి ప‌డ‌దు. ప‌చ్చిగా తింటే పొట్ట‌లో ఆమ్లాలు అధికంగా ఉత్ప‌త్తి అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. దీంతో క‌డుపులో మంట‌, గ్యాస్ వంటివి వ‌స్తాయి. క‌నుక ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చిన వారు వెల్లుల్లిని తిన‌డం ఆపేయాలి. అలాగే వెల్లుల్లి వేడి చేసే స్వ‌భావం క‌లిగి ఉంటుంది. క‌నుక వేడి శ‌రీరం ఉన్న‌వారు వేడిని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. ఇలా ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ వెల్లుల్లిని రోజూ తింటే వాటితో ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Editor

Recent Posts