హెల్త్ టిప్స్

Chintha Chiguru : ఈ ఒక్క ఆకుతో ఎన్ని వ్యాధులు త‌గ్గుతాయో తెలుసా..?

Chintha Chiguru : చింతచిగురు వలన కలిగే లాభాల గురించి, చాలామందికి తెలియదు. చింతచిగురు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతచిగురు తో, చాలా సమస్యలు దూరం అవుతాయి. చింత చెట్టు ఆకులు తీసుకుంటే, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చింత చిగురు ఫిబ్రవరి, మర్చి, ఏప్రిల్, మే నెలలలో ఎక్కువగా దొరుకుతుంది. ఈ చిగురులని సేకరించి పచ్చడి, పప్పు, కూర వంటివి చేసుకోవచ్చు. చాలా రకాల వంటకాలని మనం చింతచిగురుతో చేసుకోవొచ్చు. రుచి కూడా చక్కగా పుల్లగా ఉంటుంది. ఎవరైనా ఇష్టపడతారు. చింతపండుని వేయకుండా, చింత చిగురును పలు కూరల్లో మనం వేసుకు తీసుకోవచ్చు.

ఎటువంటి పోషకాలు ఉంటాయి..?, ఏ లాభాలను మనం చింతచిగురుతో పొందవచ్చు అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురు లో ఐరన్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. డైటరీ ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. సహజ సిద్ధమైన లాక్సేటివ్ గా ఇది పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా చింత చిగురు లో ఉంటాయి. చింతచిగురు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.

do you know how many diseases will cure with these leaves

యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. చింతచిగురుని తీసుకోవడం వలన, రోగి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చింతచిగురులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా, చింతచిగురు చూస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా చింతచిగురులో ఉంటాయి.

అనేక రకాల సమస్యల నుండి, చింతచిగురు మనల్ని బయటపడేస్తుంది. చింతచిగురుని తీసుకుంటే, శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి. రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా చింతచిగురు బాగా ఉపయోగపడుతుంది. మలేరియా జ్వరానికి చింతచిగురు రసం తీసుకుంటే, మంచిది. చింతచిగురులో ఐరన్ ఎక్కువ ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత సమస్య నుండి బయటపడిస్తుంది.

Admin

Recent Posts