Tomatoes : మన శరీరంలో ఉన్న కొవ్వును ట‌మాటాలు ఏ విధంగా క‌రిగిస్తాయో తెలుసా ?

Tomatoes : ట‌మాటాలు మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో ఒక‌టి. వీటిని రోజూ మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. ట‌మాటాలు లేకుండా అస‌లు వంట పూర్తి కాదు. అయితే ట‌మాటాల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. మ‌న‌కు ట‌మాటాలు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అందువ‌ల్ల ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ట‌మాటాలు అధిక బరువును త‌గ్గించుకునేందుకు అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరంలో ఉన్న కొవ్వును ట‌మాటాల‌తో ఎలా క‌రిగించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

do you know how Tomatoes help to shed fat in our body
Tomatoes

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక బ‌రువు త‌గ్గించే ఆహారాల్లో.. ట‌మాటాలు ఒక‌టి. వీటిల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. 100 గ్రాముల ట‌మాటాల‌ను తిన్నా కేవ‌లం 18 క్యాల‌రీలు మాత్ర‌మే ల‌భిస్తాయి. క‌నుక డైటింగ్ చేసేవారు, బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు క‌చ్చితంగా ట‌మాటాల‌ను ఆహారంలో చేర్చుకోవాలి. ఇక ట‌మాటాల్లో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును క‌రిగిస్తుంది. శ‌రీరంలో కొవ్వు చేర‌కుండా చూస్తుంది. అలాగే మ‌నం తినే ఆహారం ద్వారా శ‌రీరానికి ల‌భించే క్యాల‌రీల‌ను త్వ‌ర‌గా ఖ‌ర్చు చేస్తుంది. ఇలా ట‌మాటాల్లోని సిట్రిక్ యాసిడ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే శ‌రీరంలోని కొవ్వు అంతా క‌రిగిపోతుంది.

ట‌మాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. మ‌న‌కు 100 గ్రాముల ట‌మాటాల ద్వారా సుమారుగా 3 మిల్లీగ్రాముల మేర లైకోపీన్ ల‌భిస్తుంది. ఇది శ‌రీరంలో అడిపోనెక్టిన్ అనే స‌మ్మేళ‌నం ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీనివ‌ల్ల కొవ్వు క‌రిగే వేగం పెరుగుతుంది. దీంతో కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంది. క‌నుక కొవ్వు క‌ర‌గాల‌ని అనుకుంటే ట‌మాటాల‌ను రోజూ తినాలి.

ఇక అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం.. రోజూ 280 ఎంఎల్ మేర ట‌మాటా జ్యూస్‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా 2 నెల‌ల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే న‌డుం చుట్టు కొల‌త బాగా త‌గ్గింద‌ని తేల్చారు. అంటే కొవ్వు క‌రిగింద‌ని అర్థం. ఇలా ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇంకా ట‌మాటాల వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అనేక పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. కాబ‌ట్టి ట‌మాటాల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.

Share
Editor

Recent Posts