Rice : మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే మనం తినే ఆహారాల వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. మన శరీరంలో పలు జీవక్రియలకు కొలెస్ట్రాల్ అవసరం. కానీ ఇది అతిగా ఉంటే ప్రమాదం. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి. అయితే కొందరికి పలు ఇతర కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి. అలాంటి వారు చాలా జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దేన్ని పడితే దాన్ని తినరాదు. అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు అన్నం తినవచ్చా.. లేదా.. అని సందేహిస్తుంటారు. ఇక దీనికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం.. అంటే.. పాలిష్ చేసిన బియ్యంతో వండినది. కనుక ఇందులో 70 శాతం కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. మనం అన్నాన్ని తిన్నప్పుడు అది శరీరంలో గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది త్వరగా జరిగే ప్రక్రియ. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఇది షుగర్ ఉన్నవారికి మంచిది కాదు. కనుక షుగర్ ఉన్నవారు అన్నం తినకూడదని చెబుతుంటారు. ఇక అలా షుగర్ లెవల్స్ పెరగగానే శరీరం గ్లూకోజ్‌ను వినియోగించుకుంటుంది. అయితే మనం మన శరీరానికి తగిన మోతాదులో అన్నం తింటే తద్వారా లభించే గ్లూకోజ్‌ను శరీరం పూర్తిగా వినియోగించుకుంటుంది. కానీ ఎక్కువగా అన్నం తింటే.. శరీరంలో చేరే ఎక్కువ గ్లూకోజ్‌ను శరీరం పూర్తిగా ఉపయోగించుకోలేదు. తనకు కావల్సినంత గ్లూకోజ్‌ను మాత్రమే వాడుకుంటుంది. దీంతో కొంత గ్లూకోజ్ అలాగే మిగిలిపోతుంది. రక్తంలో ఉండే ఈ గ్లూకోజ్ కొద్దిగా మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇంకా ఏమైనా ఉంటే శరీరంలో అది కొవ్వుగా మారుతుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కనుక అన్నాన్ని తక్కువగా తినాలి.
అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు అన్నాన్ని అసలు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉంటుంది కనుక.. శరీరంలో గ్లూకోజ్ పెద్దగా వినియోగం కాదు. ఎక్కువ శాతం మిగిలిపోతుంది. అది కొలెస్ట్రాల్‌గా మారుతుంది. దీంతో కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఆ లెవల్స్ ఇంకా పెరుగుతాయి. కాబట్టి అన్నం వారికి హాని చేస్తుంది. కనుక హై కొలెస్ట్రాల్ ఉంటే అన్నం తినకూడదు. దానికి బదులుగా రాత్రి పూట చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, అరికెలు, రాగులు వంటి వాటితో వండే ఆహారాలను తినాలి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కాబట్టి హైకొలెస్ట్రాల్ ఉన్నవారు అన్నంకు బదులుగా చిరుధాన్యాలను తింటే ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.