హెల్త్ టిప్స్

ఇవి శరీర బరువును తెగ పెంచేస్తాయి.. జాగ్రత్త..!

నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను దూరం చేయకపోతే బరువు నియంత్రణలో ఉండటం అసాధ్యం. అందుకే తగిన ప్రణాళిక పాటిస్తూ అలాంటి వాటిని తీసుకోకుండా ఉంటే మంచిది. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. కాని బరువు తగ్గాలనుకునేవారు మాత్రం కొవ్వుతో నిండిన పాలు తాగకపోవడం మంచిది. నెలరోజులు వీటికి దూరంగా ఉంటే తేడా మీకే తెలుస్తుంది.

చాలామంది భోజనానంతరం తీపి పదార్థాలు తీసుకుంటారు. దాని వల్ల శరీరానికి పోషక విలువల కంటే చక్కెర శాతం ఎక్కువ అందుతుంది. ఎక్కువ తీపి వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. భోజనం వేళలు పాటించనివారు విరామ సమయంలో అధిక కార్బొహైడ్రేట్లు లభించే శాండ్‌విచ్, సమోసా, బర్గర్ల వంటివి తీసుకోవడం వల్ల ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుపోయి, ఊబకాయానికి దారితీయడంతో పాటు ఉదరసంబంధ సమస్యలూ వస్తాయి.

do you know that these foods can increase your weight

ప్రోటీన్లు లభించే ఎండుఫలాలు, నట్స్ అల్పాహారంగా తీసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది. దాంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నూనెలో దోరగా వేయించిన బంగాళాదుంప అధిక బరువుకు కారణమవుతుంది. ఈ దుంపలకు బదులుగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. కావాలంటే దుంపలను మితంగా తీసుకోవచ్చు.

Admin

Recent Posts