Red Wine : మద్యం సేవించడంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అయితే మద్యంలో అనేక రకాల వెరైటీలు ఉంటాయి. వాటిల్లో రెడ్ వైన్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇప్పటికే అనేక మంది సైంటిస్టులు చెప్పారు. తాజాగా మరోమారు సైంటిస్టులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. రెడ్ వైన్ రోజూ పరిమిత మోతాదులో తాగడం వల్ల అనేక లాభాలు పొందవచ్చని వారంటున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రెడ్ వైన్‌ను రోజూ పరిమిత మోతాదులో తాగడం వల్ల అనేక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
2. రెడ్ వైన్‌ను రోజూ ఒక పెగ్ మోతాదులో తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఎరుపు రంగు ద్రాక్షల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
3. రెడ్ వైన్‌లో ఉండే పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. ఎరుపు రంగు ద్రాక్షల్లో ఉండే రెస్వెరెట్రాల్ అనే సహజసిద్ధమైన సమ్మేళనం డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 3 నెలల పాటు క్రమం తప్పకుండా రెడ్ వైన్ తాగిన వారిలో షుగర్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల రోజూ మోతాదులో తాగితే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు బీపీ కూడా తగ్గుతుంది.
5. పరిమిత మోతాదులో రెడ్ వైన్‌ను రోజూ తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది. పెద్దపేగు, ప్రోస్టేట్, అండాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుంది. క్యాన్సర్ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
6. రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. దీని వల్ల దగ్గు, జలుబు, క్యాన్సర్, ఇతర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
7. జ్ఞాపకశక్తి పెరగాలంటే రోజూ రెడ్ వైన్ తాగాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. రెడ్ వైన్ వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
8. రెడ్ వైన్‌లో ఉండే రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.
9. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు రోజూ పరిమిత మోతాదులో రెడ్ వైన్‌ను తాగాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
10. రెడ్ వైన్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
11. రోజూ పరిమిత మోతాదులో రెడ్ వైన్‌ను సేవించడం వల్ల మనుషుల ఆయుష్షు పెరుగుతుందని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు.
కనుక రెడ్ వైన్‌ను పరిమిత మోతాదులో సేవిస్తే ప్రయోజనాలను పొందవచ్చు. రోజుకు ఒకటి లేదా ఒకటిన్నర పెగ్ మోతాదులో రెడ్ వైన్‌ను తాగవచ్చు. రెండు రోజులకు ఒకసారి కూడా రెడ్ వైన్‌ను తీసుకోవచ్చు.