Belly Fat : అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు.. ఈ రెండు సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ముఖ్యంగా చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో మరిన్ని అవస్థలకు గురవుతుంటారు. అయితే కింద తెలిపిన డ్రింక్స్‌ను రోజూ తాగుతుంటే.. దాంతో పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. మరి ఆ డ్రింక్స్ ఏమిటంటే..
1. కాఫీ
రోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుందని, దీంతో బరువు తగ్గుతారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తరువాత మన శరీర మెటబాలిజం కాస్త పెరుగుతుంది. అలాంటి సమయంలో కాఫీ తాగితే మెటబాలిజం మరింత పెరుగుతుంది. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. కనుక మధ్యాహ్నం తరువాత కాఫీని తాగడం ఎంతో ఉత్తమం. దీంతో బరువు తగ్గడంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరిగిపోతుంది. అయితే కాఫీలో చక్కెర కలపకుండా తాగితేనే ఈ ప్రయోజనం పొందవచ్చు.
2. బ్లాక్ టీ
రోజూ చాలా మంది టీ తాగుతుంటారు. కానీ బ్లాక్ టీని తాగడం అలవాటు చేసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు. అధిక బరువును తగ్గించుకోవచ్చు. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. బరువును తగ్గిస్తాయి. పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తాయి. కనుక రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ టీని తాగితే ప్రయోజనం కలుగుతుంది.
3. గ్రీన్ టీ
ప్రస్తుత తరుణంలో గ్రీన్ టీని చాలా మంది సేవిస్తున్నారు. దీన్ని తాగడం వల్ల శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. బద్దకం పోయి చురుగ్గా మారుతారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెటబాలిజంను పెంచి కొవ్వు కరిగేలా చేస్తాయి. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
4. ప్రోటీన్ షేక్స్
రోజూ వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసే వారు ప్రోటీన్ షేక్స్‌ను తాగవచ్చు. ఇవి బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తాయి. దీంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
5. యాపిల్ సైడర్ వెనిగర్
బరువును తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మెటబాలిజంను పెంచి కొవ్వు కరిగేలా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. రోజూ రాత్రి ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగుతుంటే పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుంది.