Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత నవంబర్ నెలలో రోడ్డు ప్రమాదానికి గురై సుమారుగా 40 రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న విషయం విదితమే. ఆయన కాలర్ బోన్‌కు ఫ్రాక్చర్ కావడంతో చాలా రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆయన హాస్పిటల్‌లో ఉండగానే ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలైంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సాధించింది.
అయితే సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయినా కూడా ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. ఒకటి రెండు సార్లు మెగా ఫ్యామిలీ వేడుకల్లో కనిపించారు. ఇక ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని.. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని వీడియోలు, ఫొటోలను షేర్ చేశారు. ఇక అంతే.. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు ? అన్న విషయాలు ఏవీ బయటకు రావడం లేదు.
కానీ సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్‌లో మాత్రం యాక్టివ్ గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు చెందిన హీరోలకు, చిత్ర యూనిట్‌లకు బెస్ట్ ఆఫ్ లక్‌లు చెబుతూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంగానే ఉన్నారా ? అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోమారు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ అకౌంట్‌ను కూడా వేరే వారు ఆపరేట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఆయన తరువాత సినిమా ఈ పాటికే ప్రారంభం కావల్సి ఉంది. కానీ కాలేదు, దీంతో పలు అనుమానాలు నెలకొన్నాయి. సాయిధరమ్ తేజ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి ఓ తమిళ రీమేక్‌లో నటించనున్నారని ఈమధ్య వార్తలు వచ్చాయి. దీనిపై అధికారికంగా వివరాలు ప్రకటించాల్సి ఉంది.