Fever : జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

Fever : మ‌న‌కు సాధార‌ణంగా ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు స‌హ‌జంగానే ఆహారాల్లో మార్పులు చేసుకుంటాం. వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌ను బ‌ట్టి భిన్న ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. అయితే జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు అర‌టి పండ్ల‌ను తినాలా, వ‌ద్దా.. అని కొంద‌రు సందేహిస్తుంటారు. కొంద‌రైతే అర‌టి పండ్ల‌ను తిన‌వ‌ద్ద‌ని చెబుతుంటారు. మ‌రి ఇందులో అస‌లు నిజం ఏమిటి.. అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

can you eat banana if you have Fever

జ్వరం వ‌చ్చిన‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. ఇందులో సందేహించాల్సిన విష‌యం లేదు. అర‌టి పండ్ల‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్క‌లంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. క‌నుక జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను భేషుగ్గా తిన‌వచ్చు. ఇందులో అస‌లు ఏమాత్రం సందేహించాల్సిన ప‌నిలేదు.

అయితే జ్వ‌రంతోపాటు జ‌లుబు కూడా ఉంటే అలాంటి వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదు. తింటే అధికంగా శ్లేష్మం ఉత్ప‌త్తి అవుతుంది. ఇది మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. క‌నుక జ్వ‌రంతోపాటు జ‌లుబు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌రాదు. కేవ‌లం ఒక్క జ్వ‌రం మాత్ర‌మే ఉంటే అప్పుడు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. క‌నుక ఈ విష‌యంలో ఎలాంటి అపోహ‌ల‌కు గురి కావ‌ల్సిన ప‌నిలేదు.

Editor

Recent Posts