హెల్త్ టిప్స్

Turmeric Milk : చ‌లికాలంలో రాత్రిపూట పాల‌లో ప‌సుపు క‌లిపి తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Turmeric Milk : పురాతన కాలం నుండి పసుపు పాలను త్రాగటం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. పసుపు అనేది దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో సులభంగా లభించే పదార్ధం. సాధారణ జబ్బులు లేదా నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కనీసం ఒక్కసారైనా మన అమ్మలు లేదా అమ్మమ్మలు మనందరికీ ఒక కప్పు వేడి పసుపు పాలు ఇచ్చే ఉంటారు. అయితే అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి పసుపు పాలు మాత్రమే ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?. పసుపు పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపులో ఉండే యాంటీబయాటిక్ గుణాలు మరియు పాలలో ఉండే కాల్షియం కలిస్తే, పసుపు పాలలోని లక్షణాలు మరింత పెరుగుతాయి. పసుపు పాలు తాగడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. శీతాకాలంలో ప్రజలు తరచుగా కీళ్ల నొప్పుల గురించి ఫిర్యాదు చేస్తారు. ఈ సందర్భంలో పసుపు పాలు నొప్పిని తగ్గించడంలో మరియు వాపు వల్ల కలిగే లక్షణాలను ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. పసుపు కలిపిన పాలు త్రాగటం వల్ల జలుబు మరియు దగ్గును తొలగించడంలో సహాయపడుతుంది. పసుపు పాలలో ఉండే యాంటీబయాటిక్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడుతాయి. ఈ కారణంగా మారుతున్న సీజన్‌లో పసుపును పాలలో కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి మరియు కాలానుగుణంగా వచ్చే జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది.

drink turmeric milk in the night in winter

ఇంకా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, పసుపు పాలు తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. ఇలా చేయడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు పాలు తాగడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది. నిజానికి పసుపులో ఉండే అమినో యాసిడ్ మంచి నిద్రను పొందడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది . మీకు నిద్రలేమి సమస్య ఉంటే.. ఈ రోజు నుండే పసుపు పాలు తాగడం ప్రారంభించండి. పసుపు పాలు క్యాన్సర్ రోగులకు చాలా మంచిదని పురాతన కాలం నుండి భావిస్తారు. నిజానికి పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం క్యాన్సర్ పేషెంట్ల కోలుకోవడంలో బాగా సహాయపడుతుంది.

అంతేకాకుండా ఎముకలను దృఢంగా మార్చుతుంది. పసుపు పాలలో విటమిన్ డి మరియు కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. బోలు ఎముకల వ్యాధి మరియు ఆస్టియోపెనియా వంటి వ్యాధులను దూరంగా ఉంచుతాయి. ఏ రకమైన ఎముక పగుళ్లు లేదా ఎముకలు దెబ్బతిన్నా పసుపు పాలు తాగడం మంచిది. రోజు పసుపు కలిపిన పాలు తీసుకోవడం వల్ల బరువును కూడా తగ్గిస్తుంది. పసుపులో ఉండే కాల్షియం మరియు ఇతర ఖనిజాలు కూడా శరీర కొవ్వును కరిగిస్తాయి. పసుపు కలిపిన పాలు తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూశారు కదా.. అందువలన ప్రతి రోజు ఒక గ్లాస్ వేడి పాలలో ఒక అర టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు కలుపుకొని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

Admin

Recent Posts