Warm Water : ఉదయం నిద్ర లేవగానే సహజంగానే చాలా మంది బెడ్ టీ లేదా కాఫీలను తాగుతుంటారు. అయితే వాస్తవానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే నీటిని తాగాలి. నిద్ర లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. పెద్ద పేగు శుభ్రమవుతుంది. జీర్ణవ్యవస్థ అంతా శుభ్రంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
2. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేసే విషయం.
3. ఉదయం నిద్ర లేవగానే గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, కడుపునొప్పి, తలనొప్పి తగ్గిపోతాయి. కండరాలు ప్రశాంతంగా మారుతాయి. మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. దీంతో నొప్పులు తగ్గుతాయి. రోజూ ఇలా గోరు వెచ్చని నీటిని తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు.
4. వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కానీ గోరు వెచ్చని నీటిని పరగడుపునే తాగడం వల్ల శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. దీంతో కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ క్రమంలో చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.
5. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల శిరోజాలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. శిరోజాలు కాంతివంతంగా మారి ప్రకాశిస్తాయి. జట్టు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.