హెల్త్ టిప్స్

Drumstick Flowers Tea : ఈ టీని తాగితే చాలు.. కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Drumstick Flowers Tea : చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అధిక బరువు సమస్య ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఎప్పుడూ కూడా, సరైన బరువును మెయింటైన్ చేస్తూ ఉండాలి. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు, ఈ టీ ని తీసుకుంటే మంచిది. ఈ టీ తో చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మునగాకు మాత్రమే కాదు. మునగ పువ్వు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మునగ పూలతో టీ ని తీసుకుంటే, చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మునగకాయలు, మునగ ఆకుల్లో ఉన్న ప్రయోజనాలు మనకి తెలుసు.

కానీ, మునగ పువ్వుల్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. మునగ చెట్టుకి పువ్వులు తెల్లగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఈ పూలతో టీ తయారు చేసుకుని తీసుకుంటే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. గుప్పెడు మునగ పూలను తీసుకుని శుభ్రంగా కడిగేసి, పక్కన పెట్టుకుని, పొయ్యి మీద గిన్నె పెట్టి, గ్లాసు నీళ్లు పోసి ఆ నీళ్లలో మునగ పూలు వేసి, ఏడు నిమిషాల పాటు మరిగించుకోండి.

drumstick flowers tea many wonderful health benefits

వీటిని వడకట్టేసుకుని, తేనె కలిపి ఉదయం పూట తీసుకుంటే మంచిది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు తేనె లేకుండా తీసుకోండి. గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు పరగడుపున తీసుకోవద్దు. గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు, అల్పాహారం తీసుకున్నాక అరగంట ఆగి, తీసుకోవడం మంచిది. ఈ టీ ని ప్రతిరోజు పరగడుపున తీసుకుంటే, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడొచ్చు.

దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉండవు. రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి, మంచి కొలెస్ట్రాల్ ని పెరిగేటట్టు ఇది చేస్తుంది. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటివి ఉండవు. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా లేకుండా ఈ టీ చూస్తుంది. ఈ సమస్యలేమీ లేకుండా ఉండాలంటే, వారానికి రెండు సార్లు టీ ని తీసుకోవడం మంచిది.

Admin

Recent Posts