సాధారణంగా కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కలబందను ఎన్నో రకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.కలబందను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చాలా మంది భావిస్తారు.అయితే కలబంద వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కలబందను సరైన మార్గంలో వినియోగించకపోతే ప్రమాదాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరగడుపున కలబందను ఉపయోగించేవారు సరైన జాగ్రత్తలు పాటించాలి. లేదంటే దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
కలబందను ప్రతిరోజు పరగడుపున తినటం వల్ల చాలా మంది శరీర బరువు తగ్గుతారని భావిస్తారు. కానీ మన శరీరం డీహైడ్రేషన్ కు కూడా లోనవుతుంది. కలబంద ఆరోగ్యానికి మంచిదని చాలామంది కలబంద జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. ఇలా నిరంతరం కలబంద జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో పొటాషియం స్థాయిలు అధికంగా పెరిగి హృదయ స్పందనలో మార్పులు చోటు చేసుకుంటాయి.
చాలామంది చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం కలబంద ఉపయోగిస్తారు. అయితే కలబందను ఉపయోగించినప్పుడు మీ చర్మంపై అలర్జీ సంభవిస్తే వెంటనే కలబందను ఉపయోగించడం మానేయాలి. మలబద్దక సమస్యతో బాధపడేవారికి కలబంద జ్యూస్ తాగమని సలహా ఇస్తారు. పొరపాటున కూడా కలబంద జ్యూస్ తాగకూడదు. ఈ కలబంద రసంలో భేదిమందులు ఉంటాయి, ఇవి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ .. ఫిర్యాదును పెంచడం వల్ల కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. కలబందను ప్రతిరోజు తీసుకోవటంవల్ల అది మన రక్తపోటు ప్రభావం చూపే పరిస్థితి ఉంది కనుక కలబందను ఉపయోగించే వారు ఎంతో జాగ్రత్తగా సరైన పద్ధతిలో ఉపయోగించాలి లేకపోతే ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.