Leafy Vegetables : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడానికి చూస్తూ ఉంటారు. నిజానికి మన ఆరోగ్యం బాగుండాలంటే, మంచి ఆహార పదార్థాలను తెలుసుకోవాలి. మనకి అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే, ఆహార పదార్థాలని తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మెంతి ఆకులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడతాయి. శీతాకాలంలో శరీరంలో వేడికి, అలానే ఆరోగ్యంగా ఉంచడానికి మెంతికూర బాగా సహాయం చేస్తుంది. మెంతికూరలోని ఐరన్, డైటరీ ఫైబర్, ప్రోటీన్స్, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
డయాబెటిస్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది మెంతికూర. అలానే, మునగ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మునక్కాయ, మునగాకు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో కూడా డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. క్యాన్సర్ కూడా రాకుండా చూసుకుంటుంది. బచ్చలి ఆకుల్లో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి. బచ్చలిలో కాల్షియం, ఫాస్ఫరస్ మొదలైన పోషకాలు ఉంటాయి. బచ్చలిని కూడా రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.
క్యాబేజీ తీసుకుంటే కూడా, ఆరోగ్యం బాగుంటుంది. పాలకూరలో ఐరన్, కాల్షియంతో పాటుగా ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది పాలకూర, అలానే, ఆరోగ్యం బాగుండడానికి కొత్తిమీర కూడా బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర వంటకి మంచి రుచిని మాత్రమే కాదు. ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. శక్తిని పెంచుతుంది. షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
అలానే, పుదీనా కూడా పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణశక్తిని రెట్టింపు చేస్తుంది. కాలే కూడా, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తిని కూడా కాలే పెంచుతుంది. గోంగూర కూడా పోషకాలతో ఉంటుంది. ఇలా, ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరి చేరవు.