Dry Dates Powder : ప్ర‌తి ఇంట్లోనూ ఈ పొడి క‌చ్చితంగా ఉండాలి.. ఎందుకో తెలుసా..?

Dry Dates Powder : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఖ‌ర్జూర పండ్లు కూడా ఒక‌టి. ఈ పండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు మ‌నం అనేక ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఖ‌ర్జూర పండ్లే కాకుండా మ‌నం ఎండు ఖ‌ర్జూరాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండు ఖ‌ర్జూరాలల్లో కూడా అనేక ర‌కాల పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎండు ఖ‌ర్జూరాల‌ను పొడిగా చేసి కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకోవ‌చ్చు. ఎండు ఖర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండు ఖ‌ర్జూరాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఖ‌ర్జూర పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల వాటి తీపి కార‌ణంగా ఒక్కోసారి దంతాలు జివ్వుమంటూ ఉంటాయి. కానీ ఎండు ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఇటువంటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది. వీటిని న‌మ‌ల‌లేని వారు నాన‌బెట్టుకుని తిన‌వ‌చ్చు. అలాగే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఈ ఎండు ఖ‌ర్జూరాల‌ను ఒక‌టి లేదా రెండు కంటే ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. పంచ‌దార‌కు బ‌దులుగా ఈ ఎండు ఖ‌ర్జూరాల‌ను పొడిగా చేసి వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఎండు ఖ‌ర్జూరాల‌తో పొడిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు ఖ‌ర్జూర‌ల‌ను ముక్క‌లుగా చేసి నాలుగు రోజుల పాటు ఎండ‌లో బాగా ఎండ‌బెట్టాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడి అయ్యే వ‌ర‌కు మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత ఈ పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి.

Dry Dates Powder how to make this benefits
Dry Dates Powder

ఇలా త‌యారు చేసుకున్న ఎండు ఖ‌ర్జూర పొడిని తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌కు బ‌దులుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ విధంగా ఖ‌ర్జూర పొడితో చేసిన పదార్థాల‌ను తిన‌డం వ‌ల్ల దంతాలు పుచ్చిపోవ‌డం, గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్ష‌న్, చిగుళ్ల ఇన్ఫెక్ష‌న్, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే ఖ‌ర్జూర పొడిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ ఖ‌ర్జూర పొడితో చేసిన తీపి ప‌దార్థాల‌ను ఆస్థ‌మా వ్యాధి గ్ర‌స్తులు కూడా నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. ఎండు ఖ‌ర్జూరాల పొడిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మస్య త‌గ్గుతుంది. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. గ‌ర్భిణీ స్త్రీలు దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌రిన్ని చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పొడిని పంచ‌దార‌కు బ‌దులుగా పిల్ల‌ల‌కు పాల‌ల్లో క‌లిపి ఇవ్వ‌వ‌చ్చు. దీని వ‌ల్ల వారిలో పెరుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది.

ఎముక‌లు ధృడంగా ఉంటాయి. అదే విధంగా ఈ ఎండు ఖ‌ర్జూర పొడిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల కంటి చూపు పెరుగుతుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుపడుతుంది. కండ‌రాలు బ‌లంగా త‌యార‌వుతాయి. పంచ‌దార మ‌న ఆరోగ్యానికి ఎంతో హానిని క‌లిగిస్తుంది. దీనికి బ‌దులుగా ఎండు ఖ‌ర్జూరాల పొడిని ఉప‌యోగించ‌డం వల్ల మ‌న‌కు రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యం కూడా ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts