Roasted Chickpeas : వేయించిన శనగలను చాలా మంది ఇష్టంగా తింటారు. పొట్టుతో ఉన్న శనగలను పెనంపై కొద్దిగా వేయించి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా సాయంత్రం స్నాక్స్ సమయంలో తింటారు. కానీ ఉదయాన్నే పరగడుపునే తినాలి. దీంతో ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయాన్నే పరగడుపునే వేయించిన శనగలను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేయించిన శనగల్లో విటమిన్లు ఎ, బి, సి, డి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్, ఐరన్, ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. శరీరానికి పోషణ, శక్తి లభిస్తాయి. కనుక వేయించిన శనగలను ఉదయాన్నే పరగడుపునే తింటే రోజు మొత్తానికి కావల్సిన శక్తిని పొందవచ్చు. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
2. వేయించిన శనగలను పరగడుపునే తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఈ శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్దకం సమస్యలను తగ్గిస్తుంది. అలాగే అధిక బరువు ఉన్నవారికి మేలు చేస్తుంది. బరువు త్వరగా తగ్గేలా చేస్తుంది.
3. శనగల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
4. షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నవారు శనగలను రోజూ పరగడుపునే తింటే ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
5. రోజూ నీరసంగా ఉండేవారు, శక్తి లేనట్లు భావించేవారు, బాగా అలసిపోయే వారు.. ఉదయాన్నే శనగలను తినడం వల్ల శక్తి బాగా లభిస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటూ చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసిపోరు.
6. శనగల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. అలాగే వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది.