Samantha : సోషల్ మీడియాలో సమంత ఈమధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. తన సినిమాలకు చెందిన అప్‌డేట్స్ ను ఓవైపు షేర్ చేస్తూనే మరోవైపు తన వ్యక్తిగత విషయాలపై అప్ డేట్స్‌ను కూడా ఇస్తోంది. దీంతోపాటు పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులను కూడా ఆమె ప్రమోట్ చేస్తోంది. ఇక సినిమాల సంగతి సరేసరి. ప్రస్తుతం ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. దీంతో విడాకుల తరువాత కూడా ఈమె చాలా బిజీగా మారింది. అయితే సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఓ ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది.
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ బేబీ అనే సినిమాలో నటించి అలరించింది. 2019లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సాధించింది. అయితే నందిని రెడ్డి, సమంత ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే శుక్రవారం ఆమె బర్త్ డే సందర్భంగా సమంత శుభాకాంక్షలు తెలియజేసింది. అందులో భాగంగానే ఆమె నందిని రెడ్డి గురించి ఓ పోస్ట్ పెట్టింది.
హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ ఫ్రెండ్. నువ్వు చాలా మంచిదానివి. నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ నాకు ప్రేరణగా నిలుస్తుంటావు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఇది నిన్ననే జరిగినట్లు అనిపిస్తుంది. అది 2012. అప్పట్లో నా ఆరోగ్యం అంత బాగా ఏమీ లేదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. తిరిగి నేను మళ్లీ పనిచేయగలుగుతానా.. అనిపించింది. అదే సమయంలో నువ్వు నాకోసం రోజూ వచ్చి నా బాగోగులు చూసుకున్నావు. నాకోసం సమయం కేటాయించావు. నాకు ప్రేరణనిస్తూ నా ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ పెంచావు. దాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు ఇచ్చిన ప్రేరణతోనే తిరిగి నేను నా కెరీర్‌ను కొనసాగించా.. ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో నువ్వు నా వెన్నంటి ఉన్నావు. నేను కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్లినా.. మళ్లీ కిందకు వచ్చినా.. నా వెంటే ఉన్నావు.. ప్రతి రోజూ నాకు ప్రేరణగా నిలుస్తూనే ఉన్నావు. నన్ము నమ్మినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నింటినో జరుపుకోవాలి.. అని సమంత పోస్ట్ పెట్టింది. అందులో తాను నందిని రెడ్డితో కలిసి ఉన్న ఫొటోను కూడా జత చేసింది. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.