Anxiety : ప్రస్తుత తరుణంలో చాలా మంది కంగారు, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే రోజూ మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు రోజూ ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే..
1. బ్రౌన్ రైస్ మనకు కావల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మాంగనీస్, సెలీనియం, మెగ్నిషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల బ్రౌన్ రైస్ ను యాంటీ యాంగ్జయిటీ ఫుడ్‌గా పిలుస్తారు. కనుక రోజువారీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ను చేర్చుకోవడం వల్ల కంగారు, ఆందోళన వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. కూర అరటికాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ఆందోళనను తగ్గిస్తాయి. కనుక కూర అరటికాయలను తిరచూ తినడం మేలు.
3. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంగారు, ఆందోళన వంటి సమస్యల నుంచి బయట పడేస్తాయి. కనుక వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటే మంచిది.
4. బాదం పప్పులో మెదడు కణాలను సంరక్షించే పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అలాగే మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి. కనుక కంగారు, ఆందోళన తగ్గుతాయి.
5. అవిసె గింజలను రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల కంగారు, ఆందోళన వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. వీటిల్లో మెదడు పనితీరును మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, బి విటమిన్లు, మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్, సెలీనియం, ఐరన్, జింక్ అధికంగా ఉంటాయి. కనుక అవిసె గింజలను రోజూ తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. కంగారు, ఆందోళన తగ్గుతాయి.