Gas Trouble : గ్యాస్ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు గ్యాస్ తో సతమతం అవుతున్నారు. గ్యాస్ సమస్య కొందరికి చాలా ఎక్కువగానే ఉంటోంది. దీంతో ఏం తిన్నా.. తినకపోయినా.. కొందరి పొట్ట ఎల్లప్పుడూ ఉబ్బిపోయి కనిపిస్తుంటుంది. దీంతో ఏ ఆహారం కూడా తినలేకపోతుంటారు. అయితే కింద తెలిపిన పండ్లను తీసుకుంటే గ్యాస్ సమస్య నుంచి వెంటనే రిలీఫ్ వస్తుంది. మరి ఆ పండ్లు ఏమిటంటే..
1. అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా ఎప్పుడైనా లభిస్తాయి. కనుక వీటిని రోజూ తినవచ్చు. అరటిపండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక భోజనం చేసిన తరువాత ఒక గంట విరామం ఇచ్చి ఒక అరటి పండును తినాలి. దీంతో పొట్టలో ఉండే గ్యాస్ మొత్తం పోతుంది. పొట్ట తేలిగ్గా మారుతుంది. దీంతోపాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
2. గ్యాస్ సమస్యకు పుచ్చకాయలు కూడా చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. వీటిల్లో అధిక శాతం నీరు, ఫైబర్ ఉంటాయి. కనుక భోజనం చేసిన తరువాత పుచ్చకాయ ముక్కలను ఒక కప్పు తిన్నా చాలు.. వెంటనే గ్యాస్ ట్రబుల్ నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య కూడా ఉండదు.
3. కివీ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా వీటిల్లో ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల గ్యాస్ సమస్య నుంచి ఇవి రిలీఫ్ ను అందిస్తాయి. భోజనం అనంతరం ఒక కివీ పండును తినడం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
4. అంజీర్ పండ్లలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. మన శరీరానికి కావల్సిన ఫైబర్ వీటిలో అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. రాత్రి భోజనం చేశాక లేదా ఉదయం పరగడుపునే 3-4 అంజీర్ పండ్లను తినాలి. దీంతో జీర్ణ సమస్యలు ఏవీ ఉండవు. మలబద్దకం, గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి.
5. పుచ్చకాయలలాగే కీరదోస కూడా గ్యాస్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. వీటిలోనూ నీరు అధికంగా ఉంటుంది. కనుక గ్యాస్ సులభంగా తగ్గిపోతుంది. పొట్ట ఉబ్బరంగా ఉండదు. తేలిగ్గా మారుతుంది.
6. స్ట్రాబెర్రీలలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువల్ల భోజనం అనంతరం వీటిని తింటే గ్యాస్ రాకుండా ఉంటుంది. ఇతర జీర్ణ సమస్యలు కూడా ఏర్పడవు.