వినోదం

హీరో విశ్వక్‌సేన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

విశ్వక్ సేన్ సినిమాలు నేను చూసాను .. బాగానే నటిస్తున్నాడు .. నటుడిగా ఏమి కంప్లైంట్ లేదు .. ఇప్పుడు వేరే దృష్టికోణంలో మాట్లాడుకోవాలి. చాలా ఏళ్ళ కిందట మీకు గుర్తుంటే కనుక .. ఓంకార్ అన్నయ్య ఆట ప్రోగ్రాం జీ తెలుగులో వచ్చేది. తనకి ఒక గుర్తింపు తెచ్చుకోడానికి ఆ ముద్దు ముద్దుగా, ముద్ద ముద్దగా మాట్లాడుతూ వెకిలి చేష్టలతో యాంకరింగ్ చేసే వాడు. దాని కంటే ముందు ఆదిత్య టీవీ లో యాంకర్ గా వచ్చాడు ఆ తరువాత ఆట, ఛాలెంజ్ మొదలుపెట్టాడు. డాన్స్ షో బాగానే ఉన్న కూడా ఓంకార్ అన్నయ్య చేసే అతి వలన మటుకు అందరికి నవ్వు వచ్చేది…. కొంత మంది తిట్టుకునేవారు, మరి కొంత మంది వదిలేసేవారు కానీ షో మటుకు చూసే వారు .. కానీ రాను రాను ఏంటి అంటే రియాలిటీ షో పేరు తో ఓంకార్ కాంట్రవర్సీ సృష్టించడం మొదలుపెట్టాడు .. అసలు డాన్స్ కంటే కూడా షో లో కుమ్ములాటలు మొదలు అయ్యాయి.

దాన్ని చూడటానికి చాలా మంది టీవీ ముందర కూర్చునేవారు .. TRP రేటింగ్స్ బాగానే పెరిగాయి .. ఇవ్వని చూసి జనాలకు చిరాకు లేచి కొంత మంది అయితే ఏకంగా టామ్ క్యాట్ ని పెట్టి ఓంకార్ ని బూతులు తిట్టారు. ఎవరి ఎజెండా వాళ్ళు తీర్చుకున్నారు కానీ అందరు ఒకటి మర్చిపోయారు .. ఇవ్వని చూసి ఇంపాక్ట్ అయ్యేది ఎవరు అంటే పెరుగుతున్న పిల్లలు, టీనెజర్స్,కాలేజీ స్టూడెంట్స్ .. ఏ మీడియా సంస్థ వారు కూడా ముందుకు వచ్చి ఈ పద్దతిని తప్పు పట్టలేదు. కనీసం ఈ పబ్లిక్ బూతులు వీడియోస్ బాన్ చేయాలి, లేదా రిపోర్ట్ చేయాలి అని కూడా ఎవరు అనుకోలేదు .. ఇప్పటికి ఎవరన్నా బూతులు మాట్లాడితే మనము తెగ ఎంజాయ్ చేస్తాము. సినిమాల విషయానికి వస్తే 1980- 1990 లో చాలా సినిమాల్లో ఒక హీరో అంటే .. మంచి భర్త, మంచి అన్న, మంచి తమ్ముడు, మంచి కొడుకు .. లేదా చెల్లి పెళ్లి కోసం తన కిడ్నీ సైతం డొనేట్ చేసి డబ్బులు సమకూర్చే ఒక విజేత.

what is your opinion on vishwak sen

అవ్వన్ని చూసి జనాలు నిజంగా అట్లా తయారవ్వకపోయిన .. నాశనం అయ్యే సమస్య తక్కువ ఉండేది .. 2000 తరువాత మటుకు సినిమాల్లో వచ్చిన మార్పులు చాలా బలమైన ముద్ర వేసింది… కొన్ని ఏళ్ళ కిందట ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు నేను.. అక్కడ స్టాఫ్ రూమ్ లో టీచర్లు కామెడీ చేసుకుంటున్నారు .. సర్ ఆ ఏజ్ ఏంటి ఆ గేజ్ ఏంటి మీకు ఆ పని అవసరమా అని … ఎక్కడ ఎం మాట్లాడకూడదో .. అది మాట్లాడడం అనేది చాలా కామన్ అయిపొయింది. టీచర్లు కూడా అంతా ఆ జోక్ ని నవ్వుతున్నారు, అదంతా చూసి నాకు ఆశ్చర్యం వేసింది … ఈ జోక్ మీ అందరికి తెలిసిందే పోకిరి సినిమా లో అలీ బ్రహ్మీని అడుగుతాడు .. దానికి జనాలంతా చప్పట్లు కొట్టారు. 2011 businessman లో ఏకంగా మహేష్ బాబు హీరోయిన్ ని పబ్లిక్ గా లంజ ముండా అని తిట్టాడు .. సెన్సార్ వాళ్ళు కూడా చాలా లైట్ గా దాన్ని మ్యూట్ చేశారు. ఆ డైలాగ్ చెప్పించిన డైరెక్టర్ కి నా నమస్కారాలు.

2017 లో అర్జున్ రెడ్డి వచ్చి ఏకంగా ఆడియో రిలీజ్ లో నే ఎం మాట్లాడుతున్నావ్ రా మదర్ బోర్డు అని విద్యార్థుల‌ చేత పబ్లిక్ గా అనిపించాడు. ఇలా టీవీ పెడితే తిట్లు, సినిమాలు చుస్తే తిట్లు, ఇంట్లో చదుకున్న తల్లి తండ్రులు వాడే బూతులు.. ఫక్ ఫక్ అని పది సార్లు అంటూ ఉంటె .. గత 20 ఏళ్లుగా ఇలాంటి వాతావరణం లో పెరిగిన యువకుడు .. ఎట్లా మాట్లాడుతాడు .. మన విశ్వక్సేన్ లాగ మాట్లాడుతాడు… అందులో అతని తప్పు ఏమి లేదు.. దీన్ని ఖండిచాల్సిన టైం లో ఖండించని సమాజం తప్పు.. వీటన్నిటికీ బై ప్రోడాక్ట విశ్వక్ సేన్. ఒక హీరో అనేవాడు కేవలం తన సినిమా హిట్ చేసుకోడమే ముఖ్యం కాదు .. అతని మీద ఒక సామజిక బాధ్యత కూడా ఉంటుంది. అది మర్చిపోయిన మన హీరోలు చాలా కాలం అయింది… వాళ్ళ నటన కంటే కూడా వాళ్ళు వాడిన బూతులు మాటలు జనాల్లోకి బాగా వెళ్తున్నాయి.. అందుకే ఈ మార్గం లో వెళ్తున్నారు ..

ఇంక విశ్వక్ సేన్ గురించి నా అభిప్రాయం అంటారా .. ఈ సమాజానికి సరిపోయే నటుడు విశ్వక్సేన్ .. మంచిగా నాలుగు బూతులు మాట్లాడుతూ .. నాలుగు తిట్లు తింటూ అపుడప్పుడు నటిస్తూ అతని ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటున్నాను ..

— నిశ్చల విక్రమ.

Admin

Recent Posts