Meat : మనలో అధిక శాతం మంది మాంసాహారం అంటే ఇష్టంగా తింటుంటారు. చికెన్, మటన్, చేపలు.. ఇలా వివిధ రకాల మాంసాహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎవరికి నచ్చిన మాంసాన్ని వారు తింటుంటారు. అయితే మాంసాహారం తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మనకు విటమిన్ బి12 లభిస్తుంది. ఇది నాడీ మండల వ్యవస్థ పనితీరుకు ఉపయోగపడుతుంది. శరీరంలో రక్తం తయారయ్యేందుకు పనిచేస్తుంది. అలాగే మాంసం తినడం వల్ల ఇంకా ఎన్నో పోషకాలు లభిస్తాయి.
మాంసాహారం తినడం వల్ల మనకు ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. కండరాల నిర్మాణం జరుగుతుంది. మాంసాహారంలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు మనకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మాంసాహారం వల్ల లభిస్తాయి. ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మాంసాహారంతో మనకు జింక్ కూడా లభిస్తుంది. ఈ విధంగా మాంసాహారంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే మాంసాహారం వల్ల మనకు ప్రయోజనాలు కలిగినప్పటికీ ఏ మాంసాహారం అయినా సరే అతిగా తినరాదు. తింటే అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా అధికంగా బరువు పెరుగుతారు. అది డయాబెటిస్, గుండె జబ్బులకు, కిడ్నీ వ్యాధులకు కారణమవుతుంది. కనుక మాంసాన్ని తగిన మోతాదులోనే తినాలి.
ఇక సైంటిస్టులు చెబుతున్న ప్రకారం.. ఆరోగ్యవంతమైన ఒక వ్యక్తి వారానికి సుమారుగా 450 గ్రాముల మేర ఉడకబెట్టిన మాంసం తినవచ్చు. అంటే రోజుకు సుమారుగా 64 గ్రాముల మాంసాన్ని ఒక వ్యక్తి తినవచ్చన్నమాట. అంతకు మించితే మాత్రం దుష్పరిణామాలు సంభవిస్తాయి. కనుక మాంసాహారన్ని మోతాదులో తింటూ దాని ద్వారా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.