హెల్త్ టిప్స్

రోజురోజుకు తగ్గుతున్న కంటిచూపు.. పరిష్కార మార్గాలేంటో తెలుసుకోండి!

ఇటీవలకాలంలో చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ భయపెడుతున్న సమస్య కంటిచూపు మందగించడం. వయసుతో సంబంధం అందరికీ ఇది వ్యాధిలా మారుతుంది. ముఖ్యంగా నర్సరీ చదివే చిన్నపిల్లల నుంచి వృద్దుల వరకు కళ్లజోడు ధరిస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే కొన్నిరకాల పదార్థాలను తరచూ ఆహారంలో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. అవేంటో చూద్దాం.

1. చిన్నపిల్లలు పెద్దలు చేసే పనులను ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్లు కళ్లజోడు పెట్టుకుంటే అవి పిల్లలకు పెట్టుకోవాలని ఆత్రుత ఎక్కువవుతుంది. కళ్లజోడు కావాలని అడగ్గానే తీసి వారి చేతిలో పెడుతారు. వాటిని పిల్లలు సరదాగా పెట్టుకొని టీవీ చూస్తుంటారు. ఆ సరదా కాస్త నిజం అవుతుంది. అలా ఒకరి కళ్లజోడు ఇంకొకరు ధరించడం వల్ల వారి సైటు ధరించిన వారికి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఇతరుల కళ్లజోడు పిల్లలు పెట్టుకోకుండా ఉండేలా చూసుకోండి. కంటిచూపు మెరుగవ్వడానికి కింది చిట్కాలు ఫాలో అవ్వండి.

2. బాదంపప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దృష్టి సమస్యలను పోగొడుతాయి. కంటిచూపు మెరుగయ్యేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆరు బాదంపప్పులను నీటిలో నానబెట్టుకొని పొట్టు తీసి తినాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు పోతాయి.

eye sight is decreasing know what to do

3. ఉసిరికాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. కనుబొమ్మల లోపల ఉండే రెటీనాలో కొత్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. ఒకగ్లాసు నీటిలో ఒక టేబుల్‌స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌ని కలుపుకొని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తాగితే కంటిసమస్యలు తొలిగిపోతాయి.

4. విటమిన్ ఎక్కవగా ఉండే క్యారెట్స్, యాపిల్స్, పాలకూర, బీట్‌రూట్, కోడిగుడ్డు తదితర ఆహార పదార్థాలను రోజూ తీసుకుంటే దృష్టిలోపం సమస్య నుంచి బయటపడొచ్చు.

5. ఒక కప్పు బాదంపప్పు, సోంపు గింజలు కొద్దిగా చక్కెర తీసుకొని అన్నింటిని కలిపి పొడి చేయాలి. ఈ పొడిని ఒక టేబుల్‌స్పూన్ మోతాదులో తీసుకొని రాత్రిపూట నిద్రించేందుకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల కొన్ని రోజుల్లోనే కంటిచూపు మెరుగవుతుంది.

Admin