Feet Smell : మనం మన ఉద్యోగ రీత్యా లేదా బయటకు వెళ్లినప్పుడు సాధారణంగా సాక్స్ ను, షూస్ ను ధరిస్తాము. ఇంటికి వచ్చిన తరువాత వాటిని విప్పేస్తూ ఉంటాము. ఇది సాధారణంగా అందరూ చేసేదే. అయితే షూస్ విప్పేసేటప్పుడు మన పాదాలు వాసన వస్తూ ఉంటాయి. కొందరిలో ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటుంది. కొందరి దగ్గర అస్సలు రాదు. అయితే చాలా మంది ఈ వాసన షూస్, సాక్స్ నుండి వస్తుంది అనుకుంటారు. వాటిని శుభ్రం చేయకపోవడం వల్ల ఈ వాసన వస్తుంది అనుకుంటూ ఉంటారు. అయితే శుభ్రమైన షూస్, సాక్స్ ధరించినప్పటికి కొందరి పాదాలు వాసన వస్తూ ఉంటాయి. ఇలా పాదాలు వాసన రావడానికి కారణం లేకపోలేదు. పాదాలు ఎక్కువగా స్వేద గ్రంథులను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి నిత్యం చెమలను విడుదల చేస్తూ ఉంటాయి.
అయితే గర్భిణీ స్త్రీలల్లో, యుక్త వయసులో ఉన్న వారిలో హార్మోన్లల్లో వచ్చే మార్పుల కారణంగా అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్న వారిలో పాదాలు ఎక్కువగా వాసన వస్తూ ఉంటాయి. పాదాలు ఇలా వాసన రావడం వల్ల మనతో పాటు ఇతరులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పాదాలు వాసన రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. పాదాలను ఉదయం మరియు సాయంత్రం సబ్బుతో చక్కగా శుభ్రం చేసుకోవాలి. అలాగే కాళ్ల వేళ్ల మధ్య తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే శుభ్రం చేసుకున్న తడి లేకుండా తుడుచుకోవాలి. అలాగే కాళ్ల వేళ్లకు ఉండే గోర్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే బ్యాక్టీరియా వృద్ది చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా పాదాలపై ఉండే మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి.
లేదంటే మృతకణాల కింద బ్యాక్టీరియా వృద్ది చెంది మరింత దుర్వాసన వచ్చేలా చేస్తాయి. అదే విధంగా తడి సాక్స్ లను, తడి షూస్ లను ఎప్పుడూ కూడా ధరించరాదు. ఇవి పాదాలు మరింత దుర్వాసన వచ్చేలా చేస్తాయి. కనుక ఎల్లప్పుడూ పొడి సాక్స్ లను, షూస్ లను మాత్రమే ధరించాలి. అదే విధంగా షూస్ ను ధరించేటప్పుడు పాదాలపై యాంటీ ఫంగల్ పౌడర్ ను చల్లుకోవాలి. షూస్ ను విడిచిన తరువాత న పాదాలను వెనిగర్ వేసిన వేడి నీటిలో నానబెట్టాలి. తరువాత పాదాలను తడి లేకుండా తుడుచుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మన పాదాలు దుర్వాసన రాకుండా ఉంటాయి.